📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Rajasthan thieves: హైదరాబాద్ లో రెచ్చిపోతున్న రాజస్థాన్ దొంగలు..జాగ్రత్త అంటున్న నిపుణులు

Author Icon By Sharanya
Updated: June 13, 2025 • 3:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) మహానగరం ఆన్‌లైన్ మోసాలకు (online frauds) కేంద్రబిందువుగా మారుతోంది. ఆధునిక టెక్నాలజీని ఆయుధంగా మార్చుకుని, అమాయకులను ఉరిలో పడేస్తున్న మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతులు ఆవిష్కరిస్తున్నారు. ఆధార్ దుర్వినియోగం పేరుతో కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. ఇటీవలే విశ్రాంత శాస్త్రవేత్తను రూ.1.34 కోట్లు మోసగాళ్లు దోచుకున్న సంగతి గుర్తు చేసుకోవచ్చు.

విదేశాల్లో మానవ అక్రమ రవాణా పేరుతో మోసాలు

విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారన్న కారణంతో, డిజిటల్ అరెస్ట్ పేరుతో ఇంట్లోనే బంధించి మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ కాల్స్ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ చేస్తున్నట్లు చూపించి మానసికంగా బాధిస్తున్నారు.

రాజస్థాన్ గ్యాంగ్ వెనుక అసలు కధ

హైదరాబాద్​ నగరంలోనే కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి ముఠాలు ఉన్నాయి. ఈ ముఠాలు ఎక్కువగా రాజస్థాన్​లోని (Rajasthan) భరత్‌పూర్, డీగ్, నూహ్, మెహత్‌ జిల్లాల్లో పలు గ్రామాలు సైబర్‌ మాయగాళ్లకు అడ్డాగా మారాయి. పాఠశాల స్థాయిలోనే చదువు ఆపేసిన, పదో తరగతి తప్పిన వారంతా మోసాలను ఉపాధిగా ఎంచుకుంటున్నారు. వారు సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్​ యాప్​ల వినియోగం, ఇంటర్నెట్​ కాల్స్​, కృత్రిమ మేథ సహాయంతో మార్ఫింగ్​ వీడియోలు, వాయిస్​ కాల్స్​తో ఏ విధంగా మోసం చేయాలనే అంశాలపై తర్ఫీదు పొందుతారు.

డేటా కొనుగోలు, ప్రీ ప్లాన్డ్ కాల్స్

జాబితా ఆధారంగా రోజుకు 20 నుంచి 30 మందికి వాట్సాప్​ వీడియో కాల్స్​ చేసి అటువైపు నుంచి స్పందన కోసం ఎదురు చూస్తారు. ఆయా శాఖలు, అధికారుల పేర్లు ప్రయోగించి భయపెడతారు. తమ ఖాతాల్లో జమ చేసిన నగదు లావాదేవీలను పరిశీలించి తిరిగి ఇస్తామంటూ చెబుతుండటంతో వారి వలలో చిక్కి ఎంతోమంది మోసపోతున్నారు. వివిధ వెబ్​సైట్లల నుంచి ఏజెంట్ల సాయంతో వివిధ వర్గాలకు చెందిన వారి డేటా కొనుగోలు చేస్తున్నారు.

ఎక్కువగా మోసపోతున్నవారు ఎవరంటే?

ఇలా రూ.కోట్లు నష్టపోయిన వారిలో న్యాయమూర్తులు, వైద్య నిపుణులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు, ఉన్నత విద్యావంతులే ఎక్కువగా ఉంటున్నారు.

సైబర్ క్రైమ్ విభాగం సూచనలు

హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ – గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్​ కాల్స్​కు స్పందించొద్దని నగర సైబర్​ క్రైమ్​ ఇన్​స్పెక్టర్​ ప్రసాదరావు సూచించారు. అటునుంచి రికార్డు చేసిన వీడియో కాల్​ను మార్ఫింగ్​ చేసి బెదిరించి డబ్బులు గుంజుతారని గ్రహించాలన్నారు. ప్లస్​(+)తో మొదలయ్యే కాల్​ వస్తే పట్టించుకోవద్దని తెలిపారు. అనుమానాస్పదంగా అనిపించినా, మోసపోయినట్లు గ్రహించినా 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

మిత్రుడి వాయిస్‌ను ఉపయోగించి మోసం

ఇటీవల ఒక కానిస్టేబుల్‌కి వచ్చిన ఫోన్ కాల్‌లో మిత్రుడి వాయిస్​తో మాట్లాడించారు. లండన్​ నుంచి హైదరాబాద్​ వస్తుండగా దిల్లీ ఎయిర్​పోర్టులో ఆదాయ పన్ను శాఖ అధికారులకు క్లియరెన్స్, ట్యాక్స్​ చెల్లించాలంటూ రూ.2.05 లక్షలు వారి ఖాతాల్లోకి మళ్లించుకున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి

ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే వెంటనే గమనించి స్పందించకూడదు.

Read also: Metro: మెట్రో పనులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

#CyberCrime #FraudAlert #Hyderabad #HyderabadFrauds #OnlineScam #RajasthanThieves #RajsthanGangs Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.