📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Rajanarsimha: రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రజలంతా సహకరించాలి

Author Icon By Sushmitha
Updated: October 18, 2025 • 12:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మత్తు పదార్థాల వ్యసనాన్ని పూర్తిగా అరికట్టాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రజలందరూ సహకరించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodara Rajanarsimha) పిలుపునిచ్చారు. సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యం ఉంటేనే ఈ లక్ష్యాన్ని వేరుకోగలమని ఆయన అన్నారు. డ్రగ్స్ నిర్మూలనపై పోరులో పోలీసు, ఆరోగ్యశాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ మేరకు శుక్రవారం సెక్రటేరియట్‌లో రెండు శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

Read also : DG Daljeet Singh Chaudhary: ప్రజాస్వామ్య మనుగడలో పోలీసులది కీలకపాత్ర

Rajanarsimha

ట్రీట్‌మెంట్, అవగాహన కార్యక్రమాలు

రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల గురించి టీఏఎన్సీ (Telangana Anti-Narcotics Cell) డైరెక్టర్ సందీప్ శాండిల్య మంత్రికి వివరించారు. మత్తు పదార్ధాలకు అలవాటైన వారిని గుర్తించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, ఆ తర్వాత డీఅడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు, టీచర్లు(Teachers) జాగ్రత్తలు తీసుకోవాలని, వారిలో వచ్చే ప్రవర్తన మార్పులపై (Behavioral Changes) ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని మంత్రి సూచించారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటళ్లలో రెగ్యులర్ కార్యక్రమాలు నిర్వహించాలని, క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తల ద్వారా గ్రామాల్లోనూ విస్తృతంగా ప్రచారం జరగాలని ఆయన సూచించారు.

డీఅడిక్షన్ సెంటర్ల బలోపేతం

అన్ని విద్యా సంస్థల్లో యాంటీ నార్కోటిక్స్ వింగ్స్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. డ్రగ్స్ వినియోగం నుంచి బయటపడేసేందుకు అవసరమైన డీఅడిక్షన్ సెంటర్లను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని టీచింగ్ హాస్పిటళ్లలో డీఅడిక్షన్ వార్డులు ఏర్పాటు చేశామని, ఎర్రగడ్డలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్(Institute of Mental Health) ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో డీఅడిక్షన్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. మత్తు పదార్థాలకు అలవాటైన పిల్లలను తల్లిదండ్రులే డీఅడిక్షన్ సెంటర్లకు తీసుకురావాలని, ఆలస్యం చేస్తే వారి ఆరోగ్యం మరింత పాడయ్యే ప్రమాదం ఉంటుందని మంత్రి హెచ్చరించారు. బాధితులకు పూర్తి ఉచితంగా కౌన్సెలింగ్, చికిత్స అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

డ్రగ్స్ నిర్మూలన లక్ష్యాన్ని చేరుకోవడానికి మంత్రి ఎవరి సహకారాన్ని కోరారు?

పోలీసు, ఆరోగ్య శాఖలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యాన్ని మంత్రి కోరారు.

మత్తు పదార్థాలకు అలవాటైన పిల్లల చికిత్స ఉచితంగా అందిస్తారా?

అవును, వారికి పూర్తి ఉచితంగా కౌన్సెలింగ్ మరియు చికిత్స అందిస్తారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Damodar Rajanarasimha De-Addiction Centers drug eradication Google News in Telugu Latest News in Telugu police coordination. Telangana Health Department Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.