📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rajampeta fire accident: రాజంపేట లాడ్జిలో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవ దహనం

Author Icon By Saritha
Updated: February 26, 2026 • 10:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rajampeta fire accident: కడప జిల్లా రాజంపేట పట్టణంలో బుధవారం రాత్రి పెను ప్రమాదం సంభవించింది. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని ‘దీప్ లాడ్జి’లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, సుమారు 30 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో లాడ్జిలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ (Electrical short circuit) కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మంటలు వేగంగా విస్తరించడంతో పాటు దట్టమైన పొగ కమ్ముకోవడంతో గదుల్లో ఉన్న ప్రయాణికులు ఊపిరాడక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో కొందరు పైఅంతస్తుకు పరుగులు తీసి కాపాడమంటూ కేకలు వేశారు.

Read Also: Palamaner: జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి

Rajampet fire accident: Fire accident in Rajampet lodge.. One person burnt alive

32మందిని కాపాడిన సిబ్బంది

ప్రమాద సమయంలో లాడ్జిలో మొత్తం 33 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి, లోపల చిక్కుకున్న 32 మందిని సురక్షితంగా బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రొద్దుటూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన వెంకట శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ ప్రమాదంలో మృతి చెందారు. గదిలో నిద్రిస్తున్న సమయంలో పొగ దట్టంగా వ్యాపించడంతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. అగ్నిమాపక నిబంధనలు పాటించడంలో ఏవైనా లోపాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Deep Lodge Rajampeta Kadapa ACB Raids Latest News in Telugu Rajampeta fire accident Telugu News Venkata Srinivas

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.