📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Rajagopal Reddy: రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు!

Author Icon By Anusha
Updated: August 16, 2025 • 2:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన విషయం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలే. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడం ఆయన అసహనానికి కారణమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) తనను పార్టీకి ఆహ్వానించినప్పుడు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అన్నదమ్ముళ్లిద్దరికీ ఒకేసారి పదవులు ఇవ్వలేమని చెప్పడం సరైంది కాదని బహిరంగంగా ఆరోపిస్తున్నారు.రాజగోపాల్ రెడ్డి అన్నదమ్ముళ్ల రాజకీయ యాత్రలో ఇది కొత్త విషయం కాదు. ఆయన అన్న కొమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ తరఫున ఉన్నారు. ఇద్దరూ తెలంగాణ కాంగ్రెస్‌లో బలమైన నేతలుగా గుర్తింపు పొందారు. కానీ మంత్రి పదవుల విషయంలో ఇద్దరికి చోటు ఇవ్వలేమన్న పార్టీ వాదనపై రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. “అన్నదమ్ముళ్లిద్దరికి పదవులు ఇస్తే ఏం తప్పు జరుగుతుంది?” అని ఆయన ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఆయన మరోసారి సీఎం రేవంత్‌ మీద సంచలన వ్యాఖ్యలు

మరోసారి సీఎం రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పైసలు, పదవి రెండు మీకేనా అంటూ సీఎంని ప్రశ్నించారు. శుక్రవారం నాడు సర్దార్ వల్లభ్ భాయి పటేల్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా.. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో నిర్వహించిన సభకు రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి సీఎం రేవంత్‌ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. వలిగొండ-చౌటుప్పల్ రోడ్డు బిల్లు ఆగిపోవడంతో కాంట్రాక్టర్ పని చేయడం లేదని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ బిల్లును విడుదల చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు.గత 20 నెలలుగా మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు, భవనాల కోసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి మంజూరు కాలేదని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మంత్రిని కలిసి అడిగినా ఫలితం లేకపోయిందన్నారు.

Rajagopal Reddy

పదవి వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని

ఇదే అంశంపై వంద సార్లు తిరిగినా లాభం లేకుండా పోయింది. మరి అలాంటప్పుడూ.. పదవులు మీకే.. పైసలు మీకే అని ప్రశ్నించాలా వద్దా అన్నారు. అలానే మంత్రి పదవిపై స్పందిస్తూ దీని గురించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, అది వచ్చే సమయంలో ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. పదవి వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వారితో కలిసి తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధుల కోసం పోరాడతానని తెలిపారు. తాను ముఖ్యమంత్రిని కానీ, పార్టీని కానీ విమర్శించడం లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

రాజగోపాల్ రెడ్డి పూర్తి పేరు ఏమిటి?

ఆయన పూర్తి పేరు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

ఆయన కుటుంబం కూడా రాజకీయాల్లో ఉందా?

అవును, ఆయన అన్న కొమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీగా పనిచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/sirikonda-madhusudhanachari-kcr-is-a-man-of-reason-i-will-write-a-book-on-him-soon/telangana/531053/

bhatti vikramarka Breaking News congress party Komatireddy Rajagopal Reddy latest news Minister post controversy Munugode MLA Revanth Reddy Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.