తెలంగాణ రాజకీయాల్లో(Raja Singh) మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తిరిగి బీజేపీలోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వచ్చే నెలలో కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన రాజాసింగ్, బీజేపీ(BJP) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ ను కలిసి తిరిగి పార్టీలో చేరాలనుకుంటున్న విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. (Raja Singh) పార్టీ పెద్దలు కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. గతంలో పార్టీ లైన్ దాటి చేసిన వ్యాఖ్యల కారణంగా బీజేపీ ఆయన్ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
Read also: Chicken & Eggs: పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: