📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Raja Singh: తీరు మారని రాజాసింగ్..బీజేపీ కి తలనొప్పి

Author Icon By Sharanya
Updated: June 3, 2025 • 4:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో బీజేపీ వృద్ధి చెందాలంటే క్రమశిక్షణ, ఏకత్వం అవసరం అనే సందర్భంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) మరింత సమస్యాత్మకంగా మారారు. ఆయన తరచూ పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, ఇతర పార్టీ నేతలతో రహస్య సమావేశాల ఆరోపణలు బీజేపీలో కలకలం సృష్టిస్తున్నాయి.

పార్టీకి తలనొప్పిగా మారిన ‘హార్డ్‌లైన్’ ఎమ్మెల్యే

రాజాసింగ్ తరచూ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడుతూ వ్యాఖ్యలు చేస్తుండంటతో ఆయనపై చర్యలకు బీజేపీ సిద్ధమైంది. బీజేపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన గత కొన్నాళ్లుగా తెలంగాణ బీజేపీలో అసంతృప్తి రాగాన్ని వినిపిస్తున్నారు. పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందని తరచూ ఆక్రోశించే రాజాసింగ్‌కి పార్టీని విమర్శించడానికి ఏదో ఒక సందర్భం దొరుకుతూనే ఉంటుంది. ఇటీవల బీజేపీలో బీఆర్ఎస్‌ విలీన ప్రయత్నాలు జరిగాయని కవిత చేసిన వ్యాఖ్యలు నిజమేనంటూ బాంబు పేల్చారు. పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్‌తో కలిసిపోతారని, ప్రతి ఎన్నికల్లోనూ మా నేతలు బీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యారని ఆయన చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి.

 సొంత పార్టీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనపై యుద్ధం మొదలైందని దొంగలంతా ఒక్కటయ్యారని ధ్వజమెత్తారు. కరీంనగర్ నుంచే తనపై వార్ స్టార్ట్ అయిందన్నారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం ప్రతిపాదన వచ్చిందంటూ కవిత చేసిన వ్యాఖ్యలను సమర్ధించినందుకే తనపై సోషల్ మీడియాలో వార్ నడుస్తోందని రాజాసింగ్ ఇవాళ తాజాగా మరో ప్రెస్ నోట్ విడుదల చేశారు. 2014లో పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నానని చెప్పిన ఆయన ఇక భరించలేకపోతున్నానని, పార్టీకి తాను అవసరం లేదు వెళ్లిపో అంటే వెళ్లేందుకు ఇప్పటికీ తాను సిద్ధంగా ఉన్నానంటూ సంచలన కామెంట్స్ చేశారు. వాస్తవానికి తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాలని, కానీ రిటైరైన వ్యక్తులు పార్టీలో ఉంటే ఎప్పటికీ బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని కూడా అన్నారు. .

“సస్పెన్షన్‌కు కూడా సిద్ధం” – బీజేపీకి బహిరంగ హెచ్చరిక

తనపై బీజేపీ చర్యలు తీసుకోవాలని వస్తున్న వార్తలపై రాజాసింగ్ స్పష్టంగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన్ని సస్పెండ్ చేసింది కూడా. ఆయన ఎంత బతిమాలుకున్నా చాలాకాలం సస్పెన్షన్ ఎత్తేయలేదు. చివరకు జాతీయ నాయకత్వం దయతలచి సస్పెన్షన్ ఎత్తేసింది. ఇంత జరిగినా రాజాసింగ్‌లో మార్పు రాలేదు. ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి సంబంధించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. అధ్యక్ష పదవి నిఖార్సైన పార్టీ నేతలకు మాత్రమే ఇవ్వాలన్నారు.

నోటీసుల ప్రచారంపై సైతం రాజాసింగ్ స్పందించారు. ఒకవేళ అది నిజమైతే నోటీస్ కాదు సస్పెండ్ చేయండని అన్నారు. తాను ఎటువంటి నోటీసులకు భయపడనని అన్నారు. నన్ను సస్పెండ్ చేస్తే ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగిందో నిజాలు బయటపెడతానని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని రాజాసింగ్ హెచ్చరించారు.

బీఆర్ఎస్-బీజేపీ మధ్య రహస్య వ్యవహారాల ఆరోపణలు

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలతో రహస్యంగా సమావేశాలు అయ్యే వారికి ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్ష పదవి ఇవ్వొద్దన్నారు. బీజేపీలో బీఆర్ఎస్‌ విలీన ప్రయత్నాలపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు కూడా రాజాసింగ్ మద్దతు పలకడంతో క్రమశిక్షణ ఉల్లంఘనలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే బీజేపీ రాజసింగ్‌పై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

Read also: Crocodile: ఇళ్ల మధ్యకు ప్రత్యక్షమైన మొసలి..భయంతో స్థానికులు

#bjp #BJPHeadache #BJPVsRajaSingh #PoliticalControversy #RajaSingh #RajaSinghControversy #TelanganaBJP #TelanganaPolitics Breaking News in Telugu google news telugu India News in Telugu Latest Telugu News Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.