📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Raja Singh: రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ హైకమాండ్ ఆమోదం..

Author Icon By Anusha
Updated: July 11, 2025 • 3:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలోని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత టీ. రాజాసింగ్ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపాయి. గత కొన్ని వారాలుగా పార్టీ విధానాలను, నేతల నిర్ణయాలను బహిరంగంగా విమర్శిస్తూ రావడంతో బీజేపీ అధిష్ఠానం ఎట్టకేలకు కఠిన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం (జూలై 11) నాటికి ఆయన రాజీనామాను అధికారికంగా ఆమోదించింది.ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్లుగా శుక్రవారం నాడు అనగా జులై 11 నాడు బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ (Arun Singh) అధికారిక ప్రకటన చేశారు. రాజాసింగ్ సమర్పించిన లేఖలోని అంశాలు పార్టీ పని విధానం, సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయని అరుణ్ సింగ్ తెలిపారు. అలానే రాజాసింగ్ లేవనేత్తిన అంశాలు అసంబద్ధంగా ఉన్నాయన్నారు. దీంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సూచనతో రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు అరుణ్ సింగ్ ప్రకటించారు.

వివాదాస్పద వ్యాఖ్యలు

రాజాసింగ్, ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను సమర్పించారు. కిషన్ రెడ్డి, దీన్ని పార్టీ హైకమాండ్‌కి పంపించారు. ఈ క్రమంలో నేడు అధిష్టానం రాజాసింగ్ రాజీనామా లేఖను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. రాజాసింగ్ (Raja Singh) గత కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ అధిష్టానంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావును ఎంపిక చేయడానికి వ్యతిరేకిస్తూ రాజాసింగ్ రాజీనామా చేశారు.రాజాసింగ్ మాట్లాడుతూ, తాను బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వచ్చానని, కానీ తన అనుచరులను కొందరు బెదిరించారంటూ రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు.

Raja Singh: రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ హైకమాండ్ ఆమోదం..

పార్టీ అధికారంలోకి

బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి కోసం ఆయనకు మద్దతుగా ముగ్గురు కౌన్సిల్ నంబర్లు సంతకాలు పెట్టారని, కానీ వాళ్లను కూడా బెదిరించారన్నారు. అధ్యక్షుడిని ఎప్పుడో సెలక్ట్ చేశారని, ఇప్పుడు జరిపిన ఎన్నికలు కేవలం నామమాత్రమే అని రాజాసింగ్ ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావొద్దని కోరుకునే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుందన్నారు. పార్టీ విధానాలతో తాను విసిగిపోయానని, అందుకే రాజీనామా (Resignation) చేస్తున్నానని, మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అధిష్టానం కూడా ఆయన రాజీనామాను ఆమోదించింది.

బేగంబజార్ఎంఎల్ఏ ఎవరు?

బేగంబజార్ ప్రత్యేక నియోజకవర్గం కాదు. ఇది గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. గోషామహల్ నియోజకవర్గానికి చెందిన టీ. రాజాసింగ్ లోద్ (T. Raja Singh) బీజేపీకి చెందిన ఎమ్మెల్యే. ఆయన బేగంబజార్ ప్రాంతానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బేగంబజార్ ఎందుకు ప్రసిద్ధి పొందింది?

బేగంబజార్ హైదరాబాద్‌లోని అత్యంత పెద్ద వాణిజ్య మార్కెట్‌గా ప్రసిద్ధి చెందింది. ఇది కుతుబ్ షాహీ పాలన సమయంలో స్థాపించబడింది. బేగంబజార్ ప్రధానంగా గృహ ఉపకరణాలు, పనసర వస్తువులు, మసాలా దినుసులు మొదలైన వాటికి హోల్‌సేల్ మార్కెట్‌గా పేరుపొందింది. అంతేకాకుండా, హైదరాబాద్‌లో రెండవ అతిపెద్ద చేపల మార్కెట్ కూడా బేగంబజార్‌లో ఉంది. ఈ ప్రాంతం వ్యాపార కేంద్రంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Bandi Sanjay: టీటీడీలో అన్య మతస్తులను ఉద్యోగాల నుంచి తొలగించాలని బండి సంజయ్ డిమాండ్

Arun Singh BJP High Command BJP Resignation Breaking News Goshamahal MLA JP Nadda latest news Raja Singh Raja Singh Controversy Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.