Rain Alert: ప్రకృతి వైపర్యీతాలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. అసలు రుతువుల క్రమాలు తప్పిపోతున్నాయి. ఈ ఏడాది ఎండాకాలాన్నే గమనిస్తే, మే నెలలో బాగా ఎండలు ఉండాల్సిన సీజన్ లో అకాల వర్షాలు కురిశాయి. దీంతో మామిడి వంటి పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు శీతాకాలం. చలికాలంలోనూ వర్షాలు వదలడం లేదు. గతవారం మొంథా తుపాను రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని నష్టం చవిచూసింది. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ నష్టం మరింతగా ఉంది. పలు జిల్లాల్లోని గ్రామాలు నీట మునిగిపోయాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మళ్లీ తెలంగాణకు (Telangana) మూడురోజుల పాటు వర్షాలు అని వాతావరణ శాఖ ప్రకటించింది.
Read also: Hyderabad Weather: హైదరాబాద్‌లో మొదలైన వర్షం
Rain Alert: మళ్లీ తెలంగాణకు మూడురోజులు వర్షసూచన
ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు
ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది.
ఈదురుగాలులు వీచే అవకాశం
Rain Alert: ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకొని మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఆవర్తనం ఏర్పడింది. ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణలో వాతావరణం మారిందని, వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు వివరించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: