📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana Weather: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Author Icon By Aanusha
Updated: February 23, 2026 • 9:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా రానున్న రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Read Also: Surabhi Medical College Suicide: సురభి మెడికల్ కాలేజీలో మెడికో శ్రీజ ఆత్మహత్య

Rain alert for Telangana.. Yellow alert for several districts

తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.తెలంగాణలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నేడు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Telangana Weather

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.