సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) లో, ఇప్పటివరకు రైల్వే పార్సిల్ బుకింగ్, రవాణా, డెలివరీ వంటి ప్రక్రియలు వేర్వేరు దశల్లో జరిగేవి. అయితే, సరకు రవాణాను మరింత సులభతరం చేస్తూ.. వినియోగదారుల సౌలభ్యం కోసం ఇంటి వద్దనే పికప్, డెలివరీ సౌకర్యం కల్పించే అత్యాధునిక వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు బుధవారం ప్రకటించింది.
Read Also: Sabarimala: తమిళనాడులో ప్రమాదం..ఇద్దరు దుర్మరణం
రవాణా ప్రక్రియ
ఈ నూతన విధానం ద్వారా.. ఇకపై రైలు (South Central Railway) ద్వారా పార్సిళ్లు బుక్ చేసుకోవాలనుకునేవారు రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.ఈ సమగ్ర సేవను అందించడానికి సౌత్ సెంట్రల్ రైల్వే అప్లికేషన్ ఆధారిత పార్సిల్ లాజిస్టిక్స్ సిస్టమ్‌ను రూపొందించింది. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా రైల్వే రవాణాలో ఉన్న మూడు కీలక దశల ద్వారా సరుకు రవాణా చేయనున్నారు.
సరుకులను ఇంటి వద్ద పికప్ చేయడం (ఫస్ట్‌మైల్), రైలు ద్వారా రవాణా (మిడ్‌మైల్), గమ్యస్థానంలో ఇంటికి డెలివరీ చేయడం (లాస్ట్‌మైల్) అన్నీ ఒకే వేదికపైకి తీసుకురానున్నారు. ఈ ఏకీకృత వ్యవస్థ రవాణా ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: