Kavitha: రాహుల్ వికారాబాద్ పర్యటన.. కవిత ఘాటు విమర్శలు

Read Time:  1 min
Kavitha: రాహుల్ వికారాబాద్ పర్యటన.. కవిత ఘాటు విమర్శలు
FONT SIZE
GET APP

Kavitha: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వికారాబాద్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ వైఖరిపై నిప్పులు చెరిగారు. “రాహుల్ గాంధీ జీ.. దో లాక్ నౌకరీ దో” (రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వండి) అంటూ ఎక్స్ (X) వేదికగా సూటిగా ప్రశ్నించారు.

Read Also: Telangana political news : కరీంనగర్ సీపీపై కౌశిక్ రెడ్డి ఆరోపణలు, విచారణ డిమాండ్

మడమ తిప్పిన కాంగ్రెస్: 2 లక్షల ఉద్యోగాల హామీ ఎక్కడ?

కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయిందని కవిత విమర్శించారు. “మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా?” అని ఆమె రాహుల్‌ను సూటిగా ప్రశ్నించారు. పార్టీని గద్దెనెక్కించడానికి నిచ్చెనమెట్లుగా నిలిచిన యువత ఆశలను కాంగ్రెస్ చిదిమేసిందని ఆరోపించారు. ఉద్యోగాలు అడిగితే పోలీసులతో అణచివేస్తున్నారని ఆమె మండిపడ్డారు. 

యూత్ డిక్లరేషన్ బోగస్‌గా మారిందని, జాబ్ క్యాలెండర్ అడ్రస్ లేకుండా పోయిందని కవిత విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే మోసం, వంచన అనే మాటను నిలబెట్టుకుందని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ అని గుర్తుచేసిన కవిత, ఇచ్చిన హామీని నిలబెట్టుకుని 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే అమలు చేయించాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.