📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: Raghunandan Rao: మెదక్ గ్రంధాలయాన్ని రాష్ట్రంలోనే మోడల్ గ్రంథాలయంగా తీర్చిదిద్దాలి

Author Icon By Rajitha
Updated: November 14, 2025 • 3:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మెదక్: గ్రంధాలయాన్ని రాష్ట్రంలోనే మోడల్ గ్రంథాలయంగా (Library) తీర్చిదిద్దాలి మెదక్ ఎంపీ రఘు నందన్ రావు గ్రంథాలయాలు ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి. శుక్రవారం మెదక్ గ్రంథాలయంలో 58 వ గ్రంథాలయాల వారోత్సవాల్లో ముఖ్యఅతిథిగా మెదక్ ఎంపీ రఘునాథరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి ,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ తను 5 లక్షల విలువగల పుస్తకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని, దీనికి ప్రణాళిక చేయాలని గ్రంథాలయ కార్యదర్శికి సూచించారు. మెదక్ గ్రంథాలయాన్ని రాష్ట్రంలో ఆదర్శ గ్రంధాలయంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

Read also: Medak: నువ్వేం మనిషివిరా.. మద్యం మత్తులో అన్నం పాత్రలో కాలు

గ్రంథాలయాల విజ్ఞాన భాండాగారాలని, గ్రంధాలయాలు ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ గ్రంథాలయంలో చాలామంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలిచినందుకు వారికి అభినందనలు తెలుపుతున్న అన్నారు. విద్యార్థులు తమ చదువుల్లో, పోటీ పరీక్షల్లో మాత్రమేకాదు, వ్యక్తిత్వ వికాసంలో కూడా గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా గ్రంథాలయాల చైర్మన్ సుహాసిని రెడ్డి మాట్లాడుతూ పుస్తకాలు, నూతన విషయాలు,వివిధ సమాచార వనరులు, ప్రయోగనలపై అవగాహన పెంచడానికి గ్రంథాలయాలు కీలక మాధ్యమంగా నిలుస్తున్నాయన్నారు.

నాలెడ్జ్ హబ్‌గా

కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ గ్రంథాలయాలు నాలెడ్జ్ హబ్‌గా పనిచేస్తాయనీ,అన్ని వయస్సుల వారికి పుస్తకాలు, పత్రికలు, నిఘంటువులు, ఉపయోగపడుతాయన్నారు. పరిశోధనలకు, ఉపాధ్యాయుల్లో, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు అవసరమైన వనరులను స్థానికంగా అందిస్తున్నాయన్నారు. డిజిటల్ లైబ్రరీల ద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆన్‌లైన్ సమాచారాన్ని సురక్షితంగా పొందగలుగుతారనీ, చదవడం, అభ్యాసం, సమాచారాన్ని పొందడం ద్వారా వ్యక్తిగత అభివృద్ధి సుసాధ్యం అవుతుందనీ పాఠకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ కార్యదర్శి వంశీకృష్ణ, పాఠకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

latest news Library medak Raghunandan Rao Telangana news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.