📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

R. Krishnaiah: రిజర్వేషన్లు అమలయ్యే వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి: ఎంపి ఆర్.కృష్ణయ్య

Author Icon By Ramya
Updated: July 21, 2025 • 3:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రిజర్వేషన్లు అమలు అయ్యేవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah) డిమాండ్ చేశారు. స్థానిక -సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ల అమలు, కేంద్ర ప్రభుత్వం బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించిన అంశాలపై భవిష్యత్తు కార్యాచరణ చర్చించడానికి ఆగస్టు 3న హైదరాబాద్లో రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం (Executive meeting) జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా, మండల, -రాష్ట్రస్థాయి ముఖ్య నాయకులు హాజరుకావాలని కోరారు. ఆదివారం బిసి (BC) భవన్లోజరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాజాగా జరగబోయే స్థానిక సంస్థలలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అమలుకు తీసుకోవలసిన కార్యచరణ రూపొందించాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్య -మంత్రికి విజప్తి చేశారు. బీసీలందరూ ఈ రిజర్వేషన్లు కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు.

R. Krishnaiah: రిజర్వేషన్లు అమలయ్యే వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి: ఎంపి ఆర్.కృష్ణయ్య

కులగణన చరిత్రాత్మక నిర్ణయం, బీసీలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లపై కేంద్రానికి ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah) డిమాండ్

R. Krishnaiah: కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కులగణన చేపట్టాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. 75 కోట్లకు పైగా ఉన్న బీసీ వర్గాల చిరకాల డిమాండును కేంద్రం గౌరవించినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ధన్యవాదాలు తెలిపారు. బిసిల విద్య ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ను తొలగించాలని, బిసిలకు పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా ఇవ్వాలని, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియ మాకంలో ఎస్సీ, ఎన్టీ, బీసీ రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని, ప్రైవేటు రంగంలో ఎస్సి, ఎస్టీ, బీసిలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలన్నారు. ఈ సమావేశంలో వివిధ బీసీ సంఘాల నాయకులూ గుజ్జ కృష్ణ, నీల వెంకతేష్, అంజి, లింగయ్య యాదవ్, ఆశిష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్ల అమలుపై ఆర్. కృష్ణయ్య ఏం అన్నారు?

42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.

బీసీల కులగణనపై ఆయన స్పందన ఏమిటి?

తెలంగాణలో కులగణన చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొంటూ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Bonalu 2025: అంగరంగవైభవంగా లాల్ దర్వాజ మహంకాళి బోనాలు వేడుకలు

bc-reservations bc-welfare Breaking News caste-census latest news r-krishnaiah telangana-politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.