📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest news: R. Krishnaiah: 42 శాతం బిసి రిజర్వేషన్లు అమలు చేయాలి

Author Icon By Saritha
Updated: November 27, 2025 • 12:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దీక్ష శిబిరంలో రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య

హైదరాబాద్ : జిఓ 46ను ఉపసంహరించుకుని, 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ముందుకు రావాలని రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. కోర్టులో వాదనలు పూర్తికాకముందే, రాజ్యాంగ బద్దంగా తయారు చేసిన జి ఓ 09ను రద్దు చేయకుండానే మరో జీవో విడుదల చేయడం, అలాగే ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫి కేషన్ ప్రకటించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా బుధవారం విద్యానగర్ బీసీ భవన్లో ఆర్. కృష్ణయ్య(R. Krishnaiah) ఒక రోజు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహనరావు అధ్యక్షత వహించారు. దీక్ష శిబిర ప్రాంగణంలో ఆర్. కృష్ణయ్య ప్రసంగిస్తూ బీహార్ ఎన్నికలు ముగి యగానే చడి చప్పుడు కాకుండా రిజర్వేషన్లను 42 శాతం నుంచి 22 శాతం తగ్గిస్తూ జీవో నెంబర్ జారీ చేయడం దారుణమని అన్నారు.

Read also: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు.. జైలు అధికారులు

Rajya Sabha member R. Krishnaiah at the initiation camp

17% రిజర్వేషన్ల తగ్గింపుపై బీసీ నేతల ఆందోళనలు

రిజర్వేషన్ లను 17 శాతం తగ్గించి తీవ్ర అవక తవకలు పాల్పడ్డారన్నారు. జి ఓ 46 కారణంగా పలు జిల్లాల్లో, అనేక మండలాల్లో, గ్రామాల్లో బీసీలకు(R. Krishnaiah) ఒక్క సర్పంచ్ లేదా వార్డు సభ్యుని సీటు కూడా కేటాయించలేదని, దాదాపు 1,200 సర్పంచ్ పదవులు దక్కకుండా పోయాయని, లెక్కల తో సహా అధికారికంగా వివరించారు. ఈ మోసాన్ని ఖండిస్తూ ఈ నెల 29న రహదారుల దిగ్బంధం చేపట్టాలని ఆర్. కృష్ణయ్య-పిలుపునిచ్చారు. రిజర్వేష న్లు అమలు అయ్యేంత వరకు ఉద్యమాలను ఆపేది లేదని, అవసరమైతే రోజురోజుకు ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. శాసనమండలి ప్రతి పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న బి.సి వ్యతిరేక చర్యను ఖండించారు. డా. వకుళాభరణం కృష్ణమోహ నరావు మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే మోసం అనేది ప్రజలకు తెలిసి పోయిందన్నారు.

రాజకీయ నేతలు, బీసీ నాయకుల స్పందనలు

సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్. నారాయణ మూర్తి(R. Narayana Murthy) మాట్లాడుతూ, రేవంత్ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని తెలిపారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ పాలూరు రామకృష్ణయ్య మాట్లాడుతూ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి హక్కులు సాధించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాష్ట్ర బీజేపీ బిసి మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ మాట్లా డుతూ బీజేపీ పెంచిన రిజర్వేషన్లు పూర్తిస్థాయి మద్దతు ఇస్తుందని తెలి పారు. జాతీయ బీసీసంక్షేమ సంఘం కోఆర్డినేటర్ డా. ర్యాగ అరుణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రం తప్పులు చేసి కేంద్రంపై ఆరోపణలు చేయడం అవివేకమని పేర్కొన్నారు. బి.సి. నాయకులూ నీల వెంకటేష్, గోరేగే మల్లేష్, జిల్లపల్లి అంజి, గుజ్జ సత్యం, మోడీ రాందేవ్, భూమన్న యాదవ్, అనురాధ గౌడ్, అనం తయ్య, రాజేందర్, బాణాల అజయ్, ఎం. పృథ్వి గౌడ్, జి. పద్మ, శివ యాదవ్, భీం రాజ్, అరవింద్ స్వామి, కిషోర్ యాదవ్, రాజు గౌడ్, బాలయ్య, ప్రీతం తదితరులు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

BCReservation BCRights BJPBCMorcha GO46 Latest News in Telugu PROTEST ReservationCut RevanthGovernment RKrishnayya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.