42% బీసీ రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు దగా
హైదరాబాద్ : కోర్టు కేసు తేలకుండా మున్సిపల్ జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలకు ఎలా వెళతారని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య(R. Krishnaiah) రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 42శాతం బి.సి రిజర్వేషన్(BC Reservation) ఇవ్వకుండా ఎన్నికలు జరుపడం బీసీలను దగా చేయడమే అవుతుందని, స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లు 42 శాతం పెంచిన కేసు హైకోర్టును నడుస్తుంది. గత నవంబర్ లో హైకోర్టులో ఫుల్ బెంచ్ మీదకు రావలసిన కేసు ఇంతవరకు కోర్టు బెంచ్ కూడా రాకుండా వాదించకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది.
Read Also: SIT Notice : సిట్ విచారణను కార్తీకదీపం సీరియల్ తో పోల్చిన కేటీఆర్
ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు
బీసీ బంద్ తర్వాత రాజకీయ పార్టీలు రాజ్యాంగ వ్యవస్థలని బీసీలకు అన్యాయం చేయడానికి సాహసం చేయడం లేదని అన్నారు. దీనిపై “స్టె” ఉంది. పంచాయతీ ఎన్నికలు జరిపే సమయంలో ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి వచ్చే 3000 కోట్లు గ్రాంట్ రాదని అందుకు ఎన్ని కలు జరపాలని జరిపారన్నారు. ఎందుకు మున్సి పల్ ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలకు తొందర. కోర్టు కేసు న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగపరంగా బలంగా ఉంది. ఎన్ని కోణాల్లో చూసిన కేసు గెలుస్తుంది. గెలిపించడానికి సర్వశక్తులు ఓడిపోరాడుతున్నాం. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం కేసు గెలిపించడానికి గట్టిగా ప్రయత్నం చేయకుండా ఎన్నికలకు తొందరపడడం దేనికి? కోర్టులో బీసీల కేసు అంటే ఓడిపోతుంది. కొట్టివేస్తారు. అనేది ఒక ఫ్యాషన్ గా తయారయిందన్నారు.
రాజ్యాంగం రాష్ట్రానికి అధికారం ఇచ్చింది
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 డిజి టిసి ప్రకారం స్థానిక సంస్థలోని బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ అధికారం ఇచ్చింది. దీనికి రాజ్యాంగ బద్ధతయుంది. అలాగే చట్టబద్ధత కల్పించారు. కావున అసెంబ్లీ చట్టం చేశారు. 50 శాతం సీలింగ్ను న్యాయపరమైన వాటిని అధిగామిం చామని, బీసీలు కేసులు గెలిచే అవకాశం ఉం దని, చట్ట ప్రకారం, న్యాయప్రకారం రాజ్యాం గపరమైన అవరోధాలు లేనందున జనాభా లెక్క లు ఉన్నప్పటికీ కోర్టులో కేసు గెలుస్తుందని అన్నారు. రిజర్వేషన్లు పెంచడానికి కులాల వారీగా లెక్కలు తీశారు. అసెంబ్లీలో చట్టం చేశారన్నారు. కేసు గెలవాలి. న్యాయం ముందు ఎలా గెలవదో చూస్తామని హెచ్చరించారు. బీసీల జీవితాలతో బీసీ ఆత్మగౌరవంతో చెలగాటం ఆడుతుంది. ప్రభుత్వం ఈ వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణా మాలు జరుగుతాయని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: