📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: R. Krishnaiah: 42 శాతం రిజర్వేషన్ కల్పించాకే ఎన్నికలు జరపాలి

Author Icon By Sushmitha
Updated: November 28, 2025 • 11:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (సైఫాబాద్): బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది బీసీలు గురువారం ట్యాంక్‌బండ్‌ (Tankbund) వద్దగల డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ (Telangana) బీసీ జాక్ కమిటీ ఆధ్వర్యంలో బీసీలు బషీర్‌బాగ్‌లోని నిజాం కళాశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు.

Read Also: D.C.M. Bhatti: సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఢిల్లీకి రావడానికి సిద్ధం

R. Krishnaiah Elections should be held only after 42 percent reservation is provided

కాంగ్రెస్ పార్టీపై ఆర్. కృష్ణయ్య ఆరోపణలు

ఈ సందర్భంగా జాక్ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah) మాట్లాడుతూ, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిందని, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించారని చెప్పారు. ఎన్నికల తరువాత అసెంబ్లీలో రెండుసార్లు చట్టం చేసి, మంత్రివర్గంలో కూడా ఆమోదం తెలిపి చివరకు జీవో నెంబరు 9ని జారీ చేసిందని తెలిపారు.

అయితే, బీహార్‌లో ఎన్నికల తరువాత 42 శాతం రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గిస్తూ మరో జీవో 46ను ప్రభుత్వం జారీ చేసిందని ఆయన ఆరోపించారు.

బీసీల డిమాండ్లు, ప్రభుత్వానికి సూచనలు

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, గ్రామ పంచాయితీ ఎన్నికలను వాయిదా వేయాలని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధాన మంత్రిని ఒప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Congress Manifesto Google News in Telugu government policies. Latest News in Telugu local body elections r krishnaiah Tank Bund protest Telangana BC Reservations Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.