📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

R Krishnaiah: అసెంబ్లీ సమావేశాల్లో బిసి రిజర్వేషన్లపై చర్చ జరపాలి

Author Icon By Tejaswini Y
Updated: December 26, 2025 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సిఎం రేవంత్రెడ్డికి లేఖ రాసిన ఎంపి ఆర్. కృష్ణయ్య

హైదరాబాద్ (సైఫాబాద్) : త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బిసిల రిజర్వేషన్లపై చర్చ జరిపి చట్టబద్దంగా అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య(R Krishnaiah) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నాడిక్కడ ఆయన సిఎం రేవంత్రెడ్డికి(Revanth Reddy) లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు మాత్రం పార్టీ పరంగా జరుగుతాయని, అందువల్ల చట్టబద్ధంగా బిసిల రిజర్వేషన్లను 42 శాతంకు పెంచిన తరువాతే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.

Read Also: Ranga Reddy: శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా

R Krishnaiah: BC reservations should be discussed in the assembly sessions

22% నుంచి 17%కి తగ్గించిన రిజర్వేషన్లు అక్రమం

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత రెండేళ్ళుగా బిసిలకు రిజర్వేషన్లు(BC reservations) 42 శాతంకు పెంచిన తరువాతే ఎన్నికలకు వెళతామని కొన్ని వందల సార్లు ప్రకటించిందని, గ్రామ పంచాయితీ ఎన్నికలకు నిట్ట నిలువునా మోసం చేసిందని, 42 శాతం అని ప్రకటించి, 22 శాతం ఉన్న రిజర్వేషన్లను 17 శాతంకు తగ్గించి అక్రమాలకు పాల్పడిందని, ఇది చాలా దుర్మార్గమైన చర్యని ఆరోపించారు. అయినప్పటికి బిసిలు తిరగబడి గ్రామపంచాయితీ ఎన్నికల్లో మొత్తం సీట్లలో 51 శాతం విజయం సాధించారని ఆయన గుర్తు చేశారు.

ఆర్టికల్ 243-డి-6 ప్రకారం

రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-డి-6 ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అసెంబ్లీలో బిసి బిల్లుకు చట్టం చేసి, జనాభా లేక్కలు తీసి న్యాయబద్ధం చేసిందన్నారు. అయితే 42 శాతం రిజర్వేషన్లు అమలు జరగలేదన్నారు. గతంలో సుప్రీంకోర్టు జనాభా లెక్కలు ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చునని తీర్పు ఇచ్చిందని, అందువల్ల రిజర్వేషన్లను పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నందున అసెంబ్లీలో బిసి రిజర్వేషన్లపై చర్చించి 42 శాతం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

assembly sessions BC quota 42 percent BC Reservations BC welfare r krishnaiah Revanth Reddy Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.