📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Indiramma house grant : ఇందిరమ్మ ఇళ్లపై ప్రశ్నించిన యువకుడు మృతి

Author Icon By Divya Vani M
Updated: July 4, 2025 • 9:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ములుగు జిల్లా గోవిందరావుపేట (Govindaraopet, Mulugu district) మండలం చల్వాయి గ్రామంలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. చుక్క రమేశ్‌ అనే యువకుడు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో (Indiramma house grant) జరుగుతున్న అవినీతిని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించాడు. వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేయడంతో అతడిని స్థానిక కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా బెదిరించారు.బుధవారం రాత్రి కాంగ్రెస్‌ నాయకులు రమేశ్‌ ఇంటికి వచ్చి బెదిరించగా, అదే విషయాన్ని మరోసారి వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేశాడు. తర్వాత పోలీసులు రమేశ్‌ ఇంటికి వచ్చి అతడి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు రావాలంటూ ఆదేశించారు. ఈ వ్యవహారంతో రమేశ్‌ తీవ్ర మనోవేదనకు లోనై, సూసైడ్‌ నోట్‌ రాసి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Indiramma house grant : ఇందిరమ్మ ఇళ్లపై ప్రశ్నించి బలయ్యిన యువకుడు

మృతదేహంతో రోడ్డుపై ధర్నా

ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రమేశ్‌ మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ రహదారిపై మృతదేహంతో మూడు గంటలపాటు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీఆర్‌ఎస్‌, సీపీఎం నేతలు మద్దతుగా పాల్గొన్నారు.ఘటన తీవ్రతను గ్రహించిన పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. రమేశ్‌ మృతదేహాన్ని ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

బీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు ఈ ఘటనను ప్రభుత్వ హత్యగా అభివర్ణించారు. మంత్రి సీతక్క బాధ్యత వహించాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రమేశ్‌ పంపిన వాట్సాప్‌ మెసేజ్‌లు, కాల్‌ రికార్డులు పరిశీలించి, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

ప్రశ్నించే గళాన్ని అణచివేయాలనే కుట్ర?

ఈ ఘటనపై అనేక రాజకీయ నేతలు స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించటమే నేరంగా మారిందని, కాంగ్రెస్‌ పార్టీ దౌర్జన్య ధోరణిని ఖండించారు. ఇకపై ఇలాంటివి జరగకూడదన్నదే ప్రజల ఆకాంక్షగా నిలుస్తోంది.

Read Also : KCR : కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

BRS dharna Chukka Ramesh's suicide Indiramma's house corruption Mulugu incident Mulugu news Sitakka's responsibility threats from Congress leaders young man's suicide note

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.