📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Mekaguda Veterinary Camp: పశుపోషణతో రైతుల ఆదాయం రెట్టింపు

Author Icon By Rajitha
Updated: March 17, 2026 • 12:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పి.వి. నరససింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, పశువైద్య కళాశాల రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో మేకగూడ గ్రామ దత్తత కార్యక్రమ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. దీనితో పాటుగా భారత వ్యవసాయ పరిశోధనా మండలి, ఎఐఎన్ పి , సిఈడిఎ- ఎస్ సి ఎస్ పి, పశుసంవర్ధక శాఖ, తెలంగాణ ప్రభుత్వం మరియు నాట్కో ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో మేకగూడ, సంఘీగూడ, పిట్టలగూడ గ్రామాలలో ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహించారు. మేకగూడ గ్రామ సర్పంచ్ రాజు నాయక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి విస్తరణ సంచాలకులు డాక్టర్ ఎం. కిషన్ కుమార్, గౌరవ అతిధులుగా పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి. మాధురి, రంగారెడ్డి జిల్లా పశువైద్యాధికారి డా. శ్రీనివాసరావు పాల్గొని రైతులకి మినరల్ మిక్చర్ మరియు పశుగ్రాస మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు.

Read also: Hyderabad Bus Accident : హైదరాబాద్‌లో ఫార్మా బస్సు బోల్తా 10 మందికి గాయాలు

Mekaguda Veterinary Camp: Farmers’ Income Doubled Through Livestock Rearing

ఈ సందర్భంగా డా. ఎం. కిషన్ కుమార్ మాట్లాడుతూ.. పశుసంవర్దక రంగం రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని, రైతుల పాల ఉత్పత్తి మంచి స్థాయిలో ఉన్నప్పటికీ సరైన ధర పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారంగా పాలకు విలువ పెంచే ఉత్పత్తులు తయారు చేసి మంచి ఆదాయం పొందవచ్చని రైతులకు సూచించారు. డా. ఎం. మాధురి మాట్లాడుతూ శాస్త్రీయ జ్ఞానాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లి రైతులకు అందుబాటులో ఉంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే మేరిగూడ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయడానికి విశ్వవిద్యాలయం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు.

ఉచిత వైద్య సేవలు

రంగారెడ్డి జిల్లా పశు వైద్యాధికారి డా. శ్రీనివాస రావు మాట్లాడుతూ మేకగూడ గ్రామ ప్రజలు పశుసంవర్దక రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు కానీ సరియైన పోషణ పద్ధతులు మరియు పశు ఉత్పత్తుల నిర్వహణలో సరియైన అవగాహన లేక ఆశించిన మేరకు లాభాన్ని గడించలేర పోతున్నారు. ఈ దత్తత కార్యక్రమం ద్వారా గ్రామ రైతులకు ఈ సమస్యలకు సంబంధించిన సమాచారం నేరుగా అందించి గ్రామంలో పశుసంవర్ధక సేవలను మెరుగుపరచడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేకగూడ గ్రామ ఉప సర్పంచ్ ఎడ్ల శ్రీశైలం నందిగామ గ్రామ సర్పంచ్ కొమ్ము కృష్ణ పాల్గొని మేకగూడ గ్రామాన్ని దత్తత తీసుకోవడం తమకి సంతోషకరమని ఇది వారి గ్రామ రైతుల ఆర్థిక అభివృద్ధి మెరుగుపరచడంలో తోడ్పడాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

పశువైద్య శిబిరంలో 158 పశువులకు చికిత్స

కార్యక్రమ సమన్వయకర్తగా ప్రొ.డా.సిహెచ్. సత్యనారాయణ వ్యవహరిస్తూ ఈ కార్యక్రమం ఒక గొప్ప ఉద్దేశంతో ప్రారంభించినదని దీనికి రైతుల యొక్క సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడిన ఉచిత పశు వైద్య శిబిరం ద్వారా 158 పశువులకి ఉచిత వైద్య సేవలు అందించారు. ఇందులో 93 గర్భకోశ సంబంధిత వ్యాధులు, 65 ఇతర వ్యాధులకు సం బంధించిన చికిత్స అందించడం జరిగినది. డా. వంశీ, డా. విష్ణువర్ధన్ గౌడ్, ఇతర రంగారెడ్డి జిల్లా పశువైద్యులు మరియు పశువైద్య సహాయకులు ఈ కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన విశ్వవిద్యాలయ అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, పశు వైద్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Animal Health Camp farmer welfare latest news Mekaguda milk production PVNRTVU Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.