📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Pushkaralu: నీటిపారుదల, దేవాదాయ శాఖల మధ్య సమన్వయంతో పుష్కర పనుల్లో వేగం

Author Icon By Vanipushpa
Updated: August 9, 2025 • 12:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: దక్షిణ గంగ గోదావరి(Godavari)కి పుష్కరాలు 2027 జూలై 23న ప్రారంభం కాబోతుండటంతో నీటిపారుదల, దేవదాయ శాఖల మధ్య సమన్వయంతో పనులు గుర్తిస్తే పుష్కరాల(Pushkaralu)కు వచ్చే భక్తులకు మౌలిక వసతలు కల్పించేందుకు పనులలో వేగం పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం(Kaleswaram) క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతీ పుష్కరాలను ప్రారంభించి రూ.35 కోట్లను కేటాయించారు. ఒక్క కాళేశ్వరం వద్ద రూ.200 కోట్లతో పర్యాటక పనులు చేపట్టి 2027 పుష్కరాల నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైన సవత్సరకాలంలో 2015 జూన్ 14న గోదావరి పుష్కరాలు రావడంతో ఆనాటి ప్రభుత్వం రూ.900కోట్లు వ్యయం చేసి నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుంచి మొదలు కొని ఖమ్మం జిల్లా వరకు స్నానఘాట్లు ఏర్పాటు చేసి భక్తులకు వసతులు కల్పించారు.

Pushkaralu: నీటిపారుదల, దేవాదాయ శాఖల మధ్య సమన్వయంతో పుష్కర పనుల్లో వేగం

దక్షిణ భారతదేశంలో అతి పెద్ద నది గోదావరి
దక్షిణ భారతదేశంలో అతి పెద్ద నది గోదావరి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్ల కందకుర్తివద్ద ప్రవేశిస్తుంది. మంజీరా, హరిద్రా నదులు గోదావరిలో కలుస్తుండటంతో త్రివేణిసంగమంగా స్థానికులు అత్యంత పవిత్రతో ఆప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తారు. నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్త గూడెం మీదుగా ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్కు గోదావరి నది తరలిపోతుంది. నాసిక్ లో పుట్టిన గోదావరి నదికి 2027, జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు పుష్కరాలు నిర్వహించేందుకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకూడా సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న స్నానఘాట్లకు మరమ్మతులు పూర్తి చేసి ఉపయోగంలోకి తేవాలని నిర్ణయించారు. 2015లో రెండు రాష్ట్రాల్లో 316కు పైగా ఘాట్లు ఉండగా 8.75కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వగణాంకాలు వివరిస్తు న్నాయి.
బాసరలో 70లక్షల మంది, ధర్మపురిలో 65లక్షలమంది, కాళేశ్వరంలో కోటి మంది, కోటిలింగాల 30లక్షల మంది, మంథనిలో 45లక్షల మంది, భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం, మణుగూరు, బూర్గంపాడు, దుమ్ముగూడెం.

యాబైలక్షల మంది పుణ్యస్నానాలు

అశ్వాపురం మండలాల్లోని గోదారి తీరంలో యాబైలక్షల మంది పుణ్యస్నానాలు చేశారని ప్రభుత్వ గణాంకాలు వివరిస్తున్నాయి.15వందల సాదువుల స్నానం ఆచరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కోటి యాభైలక్షల రూపాయలు బడ్జెట్ పెట్టారు. ఇటీవల కుంభమేళా, సరస్వతీ పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. దీన్నిబట్టి చూస్తే ఈసారి పుష్కరాలకు భక్తుల వెల్లువ తప్పదని భావిస్తున్నారు. కాళేశ్వరం, బాసర, ధర్మపురి భద్రాచలంకు పొరుగు రాష్ట్రాల నుంచి, విదేశాలలో ఉండే ఎన్ఆరలు కూడా వచ్చి స్నానం చేసే అవకాశం ఉంది. క్షేత్ర స్థాయిలో పనులు మాత్రం చేయడం లేదు. దేశ విదేశాలకు చెందిన భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు తరలివచ్చే వీలున్నందున ఆ స్థాయిలో నిధులు వరదలా రావాలి.

వేగంగా పనులు
రాజమండ్రిలో గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పనులను వేగంగా చేస్తున్నది. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లో 202 ఘాట్ల సుందరీకరించేందుకు తొలి విడతగా రూ.150 కోట్లు అవసరమని అంచనా వేశారు. కార్యాచరణ రూపొందిస్తున్నారు. తెలంగాణలోను కందకుర్తి నుంచి భద్రాచలం వరకు 102 ఘాట్లు ఉండగా వీటిని బాగు చేయించడంతో పాటు కొత్త ఘాట్ల నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయించాలని దేవాదాయ శాఖ ప్రతిపాదించింది. భక్తుల సంఖ్యకు తగ్గట్టు గోదావరి పుష్కరాలకు భారీగానే నిధులు వస్తామని అంచనాలు కడుతున్నారు.


పుష్కరాలు ఎందుకు 12 సంవత్సరాలు?

పుష్కరం అనేది 12 పవిత్ర నదులను పూజించడానికి అంకితం చేయబడిన భారతీయ పండుగ . ఈ వేడుక ప్రతి సంవత్సరం, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రతి నది వెంట జరుగుతుంది. ప్రతి నది ఒక రాశితో ముడిపడి ఉంటుంది మరియు ప్రతి సంవత్సరం పండుగకు నది బృహస్పతి (గురు) ఆ సమయంలో ఏ రాశిలో ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది.

భారతదేశంలో నది పండుగ ఏమిటి?

ఇది భూమిపై జరిగే అతిపెద్ద మతపరమైన సమావేశం అయిన కుంభమేళా . ఈ సంవత్సరం తీర్థయాత్రకు దాదాపు 400 మిలియన్ల మంది యాత్రికులు హాజరవుతారని, నదులలో స్నానం చేసి తమ పాపాలను కడుక్కోవచ్చని అంచనా.

AndhraPradesh coordination endowments-department irrigation-department Latest News Breaking News Pushkaralu Telugu News temple-management water-projects

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.