📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Today News : Priests – ఉన్నతాధికారుల బదిలీలపై అర్చకుల భయాందోళ

Author Icon By Shravan
Updated: August 23, 2025 • 1:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ Priests : దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, పూజారులు బయట ఇతర కార్య క్రమాల్లో పాల్గోనకూడాదనే దేవాదాయ శాఖ ఉత్తర్వులను వ్యతిరిక్తి ఆందోళనలు చేసేం దుకు సిద్ధం అవుతున్నారు. ఎవరో ఒకరు ఇద్దరు చేస్తున్న పనిని దృష్టిలో ఉంచకుని ఈ విధంగా పూజారులు, అర్చకులను కించపరిచే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం సరికాదంటున్నారు. తాము ఆహర్నిషలు కృషించి దేవాలయాల అభివృద్ధికి (Development) తమవంతు సహాకారం అందిస్తున్నామని, ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసి తమను అవమా నిస్తోందని మండి పడుతున్నారు. తమపూజాపునస్కారాలతో ఉదయం లేచి ఆ భగవంతుని సేవలో తరిస్తూ అందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థి స్తున్నామన్నారు.

అర్చకులపై బలవంతపు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పూజారుల ఆవేదన

ఎటువంటి సెలవులు, వారాంత రపు సెలవులు లేకుండా పని చేస్తున్నతమపై ఇటువంటి బలవంతపు ఉత్తర్వులు సరికాదం టున్నారు. పుణ్యదినాలు, పండగ రోజుల్లో తాము ఎటువంటి విరామం విసుగు లేకుండా పని చేస్తున్నామని, పండగ రోజుల్లో ఉదయం 3.30 గంటలకు లేచి దేవాలయాన్ని శుభ్రం చేసుకొని పూజా కార్యకమాలు అనంతరం మరోసారి దేవాలయాన్ని పరిశుభ్రం చేసుకుని కంటిమీద కునుకు లేకుండా శ్రమిస్తున్న తమ శ్రమను గుర్తించకుండా ఇటువంటి అర్ధంపర్ధం లేని ఉత్తర్వులతో తము ఇబ్బంది పెట్టడమే అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్త లోకోసుఖినో భవంతు: అనిభావించితాము భక్తులను దీవిస్తామని, దీని వెనుక ఎటువంటి ఉద్దేశ్యాలు ఉండవని లేనిపోనివి అభాండాలు, మాకు ఆపాందించి భగవంతునికి భక్తునికి అను సంధా నంగా ఉండే మమ్మల్ని అవమానించడం కాక మరేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

దేవాలయ అర్చకులపై చర్యలకు వ్యతిరేకంగా పూజారుల ఆందోళన హెచ్చరిక

దేవాలయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పలు అభివృద్ధి పనులు చేపడుతుండటంతో ఆయా ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుండటంతో ఆలయాలకు కూడా పెద్ద మొత్తంలో కానుకలు, ఇతర రూపాల్లో ఆదాయం కూడా భారీగా పెరుగుతోందంటున్నారు. ఎఒక్క వైపు ఆల యాల అభివృద్ధికి చేపడుతూ మరో వైపు ఆ దేవుళ్ళన్న నమ్ముకుని వారినే ఆరాధిస్తున్న జీవి తాలను గడుపుతన్న మమ్మల్ని ఈ నూతన ఉత్తర్వులు ఎంతో కృంగదీయడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తున్నాయనివారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Priests – ఉన్నతాధికారుల బదిలీలపై అర్చకుల భయాందోళ

జోగులాం గద్వాల్ (Jogulam Gadwal) దేవాలయంలో నూతన ఉత్తర్వులు ప్రకారం ఇద్దరి అర్చ కులను సస్పెండ్ చేసి, ఇఒను మాత్రం బదిలీ చేయడం ఎంతవరకు సబబుని వారి ప్రశ్నిస్తు న్నారు. నిబంధనలు అధికారులకు ఒకలా అర్చకులు, పూజారులకు మరోలా ఉండవని కానీ ప్రభుత్వం ఈ విషయంలో ఉన్నతస్థాయి అధికారులను ఒకలా అర్చకులను, పూజారులను మరోలా చూస్తూ పక్షపాత ధోరణి అవలంబిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి నిబంధనల పెట్టి వేద మంత్రోచ్చరణ చేసే తమనోర్లుమూయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే పెద్దఎత్తున ఆందోళన చేసేందుకు కూడా వెను కాడమని ఆయా సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/13056-people-applied-for-icet-counseling/more/career/534870/


Archakas Breaking News in Telugu Latest News in Telugu Priest Concerns Religious News Telangana news Telugu News Temple Priests

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.