ప్రీబడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్ : Pre-Budget Meetings: రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని, ఈ రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎన్ని నిధులైన ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడబోదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) అన్నారు. బుధవారం బి.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మైనారిటీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, రోడ్డు రవాణా, నీటిపారుదల శాఖ, సివిల్ సప్లయిస్, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల బడ్జెట్ సమావేశాలు జరిగాయి. సమావేశాల్లో మంత్రులు ఉత్తంకుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్డూరి లక్ష ్మణ్ కుమార్, అజారుద్దీన్లతో కలిసి డిప్యూటీ సీఎం ఫ్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. మంత్రి అజారుద్దీన్తో కలిసి మైనార్టీ సంక్షేమ శాఖ సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఆలోచించి, నిబద్ధతతో ప్రాధాన్యతను గుర్తించి, ఆడాయం ఖర్చుపై దృష్టి సారించి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
Read Also: Balka Suman : బాల్క సుమన్ అరెస్టు !
దేశంలోనే మోడల్గా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు
సంక్షేమ శాఖకు సంబంధించి వసతి గృహాలు, గురుకులాల బిల్లులు ఎంత తొందరగా పంపితే అంత తొందరగా క్లియర్ చేస్తామని, వసతి గృహాల భవనాల మరమ్మత్తులు వేగంగా పూర్తి చేయాలని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులను (Pre-Budget Meetings) ఆదేశించారు. ప్రపంచ స్కూల్స్ ఉమ్మడి స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ నిర్మిస్తున్నామని అన్ని వర్గాల విద్యార్థులు కుటుంబంలా కలిసిపోవడమే అన్నారు. విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్కు బయోమెట్రిక్ విధానం లేకపోతే వెంటనే అమలులోకి తీసుకురావాలని వాటిని కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్ బిల్డింగ్ల పైన సోలార్ పవర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ తో సమావేశమై ఏర్పాటు చేసుకోవాలని కరెంటు భారం లేకుండా చేసుకోవడమే కాదు, సోలార్ ద్వారా ఆదాయం సృష్టించుకోవచ్చని తెలిపారు.
వసతి గృహాల్లో అన్ని రకాల సౌకర్యాలు
వసతి గృహాలు, సంక్షేమ హాస్టళ్లకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెందాం కొత్త మెనూ అమల్లోకి తీసుకు వచ్చాం, వసతి గృహాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. నేపథ్యంలో జిల్లా అధికారులు, రాష్ట్రస్థాయి అధికారులు వసతి గృహాలను సందర్శించి అన్ని విషయాలను పరిశీలించాలని వీలైతే ఒక రోజు రాత్రి అక్కడే బస చేయాలని గతంలోనే ఆదేశించాం, ఆ ప్రక్రియ ఎంత మేరకు కొనసాగుతుందో సెక్రటరీలు ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా పర్యవేక్షణ జరపాలని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వసతి గృహాల అధ్యలను క్లియర్ చేస్తున్నామని లక్షలను బిల్లులు ఉంటే వెంటనే వంపాలని వెనువెంటనే క్లియర్ చేస్తామని తెలిపారు. వరి సాగు పెద్ద ఎత్తున చేయడం, బాయిల్డ్ రైస్ ను తమిళనాడు వంటి రాష్ట్రాలు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడం నేపథ్యంలో భవిష్యత్తులో రాష్ట్ర రైతాంగం ఇబ్బం దులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వంట మార్పిడికి అవరాశా పరిశీలించాలని నీటిపారుదల శాఖ సమావేశంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సూచించారు.
ప్రత్యేక పథకాలు
వరి స్థానంలో పామ్ ఆయిల్, పప్పు ధాన్యాలు సాగు చేస్తూ, పంట నిలువల స్టోరీ ఈ సామర్థ్యాన్ని రాష్ట్రంలో పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. తమ ప్రభుత్వం బీసీ లకు బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పిస్తుంది. బీసీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మోలిక నదుపాయాలు కల్పించడంతో పాటు గ్రీన్ చానెల్ ద్వారా డైట్ కాస్మొటిక్ ఛార్జీలు విద్యార్థులకు స్కాలర్ షిప్ లు విడుదల చేస్తుందనీ డిప్యూటీ సీఎం తెలిపారు. గత ప్రభుత్వం గురుకుల పాఠశాలలు అద్దెలు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంచేదని ప్రజాపాలన ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు గురుకుల పాఠశాలలు, ఈసారి బడ్జెట్ లో బీసీలలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి వారి ఆర్థిక వృద్ధి సాధించడానికి ప్రత్యేక పథకాలు ప్రారంభించాలని కోరడం జరిగిందనీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్షీ శ్రీ ద్వారా ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయ వంతంగా జరుగుతుంది. ప్రభుత్వం మహాలక్ష్మీ స్త్రీ నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంది.
యుద్ధప్రాతిపదికన హాస్టల్ భవనాల మరమ్మతులు
గ్రామీణ ప్రాంతాలకు తెలిపారు హాస్టల్ బిల్డింగుల మరమ్మతు చెందిన విద్యార్థులు సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల కోసం హైదరాబాద్ కు వచ్చి ఆర్థికంగా, ఇతరత్రా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నియోజకవర్గ కేంద్రాల్లో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లు ప్రారంభించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉండని డిప్యూటీ సీఎం వివరించారు. దేశంలో, రాష్ట్రంలో అత్యుత్తమ ఉపాధ్యాయులను గుర్తించి హైదరాబాద్ నుంచి ఆన్లై పాఠాలు బోధిస్తారని ఇది దేశంలోనే ఒక మోడల్ గా మారబోతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. లోయర్ ట్యాంక్ బండ్, కాచిగూడ కేంద్రంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న విలువైన స్థలాల్లో భారీ బవంతులు నిర్మించి విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు. భవనాలు నిర్మించే ఆలోచనలు చేయాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ తెలిపారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సంక్షేమ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్, రవాణా, రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్:రాజ్, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, సివిల్ సప్లై శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సంక్షేమ శాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్య, డిప్యూటీ సీఎం పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: