తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ నేటి నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే కాకుండా, వివిధ రంగాల్లో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Read Also : Telangana Govt : మహిళల కోసం రేవంత్ సర్కార్ అనూహ్య నిర్ణయం!
ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కు శ్రీకారం చుట్టింది. నేటి నుంచి ప్రారంభమై జూన్ 12 వరకు, అంటే దాదాపు 99 రోజుల పాటు ఈ బృహత్తర కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం, క్రీడలు, యువత మరియు నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ప్రతి విడతలోనూ ఒక నిర్దిష్ట రంగానికి ప్రాధాన్యతనిస్తూ, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యం. ప్రభుత్వం నిర్దేశించిన ఈ 99 రోజుల గడువులోగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టించడం ద్వారా రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చాలని యోచిస్తోంది.
ఈ ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి మార్చి 15వ తేదీ వరకు మొదటి విడత కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో ప్రధానంగా రెండు అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మొదటిది ‘పరిసరాల శుభ్రత’ – అంటే గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులను ముమ్మరం చేసి, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం. రెండవది అత్యంత కీలకమైన ‘పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్’. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి మూలనపడ్డ ఫైళ్లను వెలికితీసి, ప్రజలకు రావాల్సిన సేవలను సకాలంలో అందించేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ చొరవ వల్ల ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం పెరగడమే కాకుండా, సామాన్యుడికి సత్వర న్యాయం చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :