Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిట్

Read Time:  1 min
Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిట్
FONT SIZE
GET APP

తెలంగాణ సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) విషయంలో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చిన మినహాయింపులను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ బాట పట్టారు.ఈ కేసు విచారణలో భాగంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరితో కూడిన సిట్ బృందం ఢిల్లీకి చేరుకుంది. ప్రభాకర్ రావు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని, ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారిస్తేనే కీలక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సిట్ (SIT) భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్‌పై ఉన్న స్టేను ఎత్తివేయాలని కోరుతూ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది.

Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిట్
Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిట్

ఆదేశాలతోనే

ఇప్పటికే ఐదుసార్లుగా దాదాపు 40 గంటల పాటు ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే, ప్రతిసారీ ఆయన పొంతనలేని సమాధానాలు ఇస్తూ దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. పై అధికారుల ఆదేశాల ప్రకారమే తాను నడుచుకున్నానని ఆయన చెబుతుండగా, ఆయన ఆదేశాలతోనే తాము ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) చేశామని ఇప్పటికే అరెస్టయిన ఇతర నిందితులు వాంగ్మూలం ఇచ్చారు.ఈ వైరుధ్యాల నేపథ్యంలో, ఆగస్టు 5 వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను రద్దు చేయించడం ద్వారా, కస్టోడియల్ విచారణకు మార్గం సుగమం చేసుకోవాలని సిట్ అధికారులు యోచిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే ఏమిటి?

ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది అధికారులచే ప్రజా ప్రతినిధులు, అధికారులు, వ్యాపారవేత్తలు, పౌరుల ఫోన్ల సంభాషణలను చట్ట విరుద్ధంగా గూఢచర్యం చేయడం. ఈ వ్యవహారంలో వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన జరుగుతుంది.

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎలా వెలుగులోకి వచ్చింది?

కొంతమంది అధికారులు టెలికం కంపెనీల సాయంతో ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు రావడంతో, కేసు వెలుగులోకి వచ్చింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దీనిపై SIT (Special Investigation Team) ను నియమించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: KCR: వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కేసీఆర్

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.