📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Prabhakar Rao: ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసు – సుప్రీం బెయిల్ డిసెం 9 వరకు పెంపు

Author Icon By Tejaswini Y
Updated: November 19, 2025 • 11:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి ముద్దాయిగా వున్న ఎస్ఐఐబి మాజీ బాస్ ప్రభాకర్ రావుకు(Prabhakar Rao) సుప్రీం కోర్టులో మరోసారి ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ఇంతకు ముందు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సర్వోన్నత న్యాయస్థానం పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. ప్రభాకర్ రావుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పోలీసుల విచారణకు సహకరించడం లేదని తెలిపారు.

Read also : Sri Venkateswara Swamy: తిరుమల వైకుంఠద్వారం ఆన్లైన్

Prabhakar Rao phone tapping case Supreme Court extends bail till December 9

మొదటి ముద్దాయిగా వున్నారని

ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసులో ఆయన మొదటి ముద్దాయిగా వున్నారని, ట్యాపింగ్కు సంబంధించిన అన్ని ఆధారాలను ఆయ న ధ్వంసం చేశారని, పోలీసు అధికారిగా తనకున్న అధికారాలను దుర్వినియోగం చేశారని, సహచర పోలీసు అధికారులచేత కాని పనులు చేయించా రని, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని వారు సుప్రీంకోర్టుకు తెలిపారు. అప్పట్లో రాజకీయ నేతలే కాకుండా జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని వారు వాదించారు. సుప్రీం కోర్టులో లభించిన మధ్యంతర బెయిల్ను ఆయన దుర్వినియోగం చేశారని, దీనిని వెంటనే రద్దు చేయాలని వారు కోరారు. దీనిపై ప్రభాకర్ రావు తరపున వాదించిన
న్యాయవాది ఫోన్ ట్యాపింగ్ కేసులో తన క్లయింట్ పాత్ర ఏమీ లేకున్నా పోలీసులు అనవసరంగా ఇరికించారని తెలిపారు.

సుప్రీం కోర్టు ధర్మాసనం

ఇప్పటికే అనేకసార్లు ప్రభాకర్ రావు(Prabhakar Rao) సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారని, పోలీసులు గంటల తరబడి అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారని, పొంతనలేని ప్రశ్నలు అడిగినా ఆయన ఓపికగా జవాబులు ఇచ్చారని ఆయన తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం దీనిపై తదుపరి విచారణను డిసెంబరు తొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ప్రభాకర్ రావుకు వున్న మధ్యంతర బెయిల్ను పొడిగించించడంతో పాటు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో పోలీసుల విచారణకు ప్రభాకర్ రావు సహకరించాలని, ఆయనను పోలీసులు విచారించుకోవచ్చని ఆదేశించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

Phone Tapping Case Prabhakar rao Prabhakar Rao bail SC interim bail Supreme Court updates Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.