📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Poorna Chandra Rao: బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం కావాల్సిందే – మాజీ డిజిపి పూర్ణచందర్రావు

Author Icon By Sharanya
Updated: July 19, 2025 • 12:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: బీసీలు అందరితోపాటు సమాజంలో గౌరవంగా బతకాలంటే తప్పనిసరిగా బిసిలకు రక్షణ చట్టం (BC Protection Act) కావాల్సిం దేనని ఆల్ ఇండియా బిఎస్పీ పార్టీ జాతీయ కోఆర్డినేటర్, విశ్రాంత డిజిపి డా. జుజ్జవరపు పూర్ణచంద్ర రావు (DGP Poorna Chandra Rao) అన్నారు. ఈమేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బిసి సమాజ్ అధ్యక్షలు సంగెం సూర్యారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి మాజీ ఐఏఎస్ చిరంజవులు, విజెఆర్ నారగోని తదితరులు హాజరై ప్రసంగించారు.

తెలుగు రాష్ట్రాల్లో బిసిలు అనచివేతకు గురవుతున్నారన్నారు

ఈ సందర్భంగా పూర్ణచందర్ రావు (DGP Poorna Chandra Rao) మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో బిసిలు అనచివేతకు గురవుతున్నారన్నారు. గతంలో ఎస్సీలపై దాడులు (Attacks on SCs past)జరగడంతో ఎస్సీ రక్షణ చట్టం వచ్చిందని ఇప్పుడు బీసీలు మాట్లాడడానికే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. ఇటీవల బీసీ రాజకీయ నాయకులు అనేక దాడులు చేస్తున్నారని అందులో భాగంగానే ఎమ్మెల్సీ తీన్మా ర్ మల్లన్నపైనా దాడి జరిగిందన్నారు. భారత రాజ్యాంగం అందరికీ హామీ సమానత్వాన్ని ఇస్తున్నప్పటికీ, బిసిలు ఇంకా వివక్ష, దౌర్జన్యం, సామాజిక బహిష్కరణకు గురవు తున్న నేపథ్యం లో, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక చారి త్రకమైన రక్షణ చట్టాన్ని రూపొం దించా ల్సిన అవసరం ఉందన్నారు. వెనుకబడిన తరగ తులపై ‘వివక్ష, అణచివేత నిరోధక చట్టం, 2025 అనే ముసాయి దాను బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ నాయకులు విడుదల చేసారు.

ఈ చట్టం ద్వారా బీసీలపై జరిగే సామాజిక, ఆర్థిక, శారీరక అణచివేతను నిరోధించ డంతోపా డంతోపాటు, బాధితులకు న్యాయం, గౌరవం, పునరా వాసం కల్పించేందుకు నూతన నిబంధనలు రూ పొందించ బడ్డాయన్నారు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే, రాష్ట్రంలోని బీసీ వర్గాలపై జరిగే వివక్షను సమూలంగా అరికట్టగలదని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, యువజన సంఘం అధ్యక్షులు కనకాల శ్యాంకురుమ, వివిధ సంచార జాతుల ప్రతినిధులు పాల్గొన్నారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Telangana Pensions: ఇకపై ఫేస్ రికగ్నిషన్ తో పింఛన్ తీసుకోవచ్చు

backward classes rights BC empowerment BC protection law Breaking News DGP Poorna Chandra Rao latest news legal protection for BCs Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.