📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ponnam Prabhakar: హుజురాబాద్ సమగ్ర అభివృద్ధికి చర్యలు

Author Icon By Saritha
Updated: March 11, 2026 • 12:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దశాబ్దాల తర్వాత ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా: మంత్రి పొన్నం

Ponnam Prabhakar: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి రెండు సంవత్సరాల కాలంలోనే సమగ్రంగా అన్ని పథకాలు అమలు జరుపుతూ వస్తున్నామని, కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధికి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తుంటే అసుయవరులు జీర్ణించుకోలేకపోతున్నారని, హుజురాబాద్ గడ్డపై దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఈ ప్రాంత ప్రజలు కోరుకున్న అతిపెద్ద మార్పు అని, రానున్న కాలంలో ప్రగతికి శుభసంకేతమని తెలంగాణ రాష్ట్ర బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Read Also: Srushti Hospital: డాక్టర్ నమ్రత కుటుంబం రూ. 50 కోట్ల ఆస్తులు జప్తు

Ponnam Prabhakar: Steps for comprehensive development of Huzurabad

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక ప్రారంభం

మంగళవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యచరణ పథకాన్ని ప్రారంబించేందుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఓడితల ప్రణవ్లు హజరైయ్యారు. తొలుత హుజురాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఎన్నికైన రొంటాల సుహాసిని, వైస్ చైర్పర్సన్ గూడురి అంజలి, కౌన్సిలర్ల పదవిబాధ్యతల స్వీకరణ కార్యక్రమం మంత్రి పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా అట్టహాసంగా నిర్వహించారు.

నేతలకు నివాళులు, భారీ ర్యాలీ

అంతకుముందు హుజురాబాద్ అంబేద్కర్ చౌక్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులతో కలిసి ర్యాలీగా వస్తూ, మాజీ రాజ్యసభదివంగత నేత సింగాపూర్రాజేశ్వర్రావు, జగజీవన్రావు విగ్రహాలకు పూలమాలలు వేసినివాళులు అర్పించి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం జరిగిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుండి హుజురాబాద్ ప్రాంతంతో తనకు మంచి సంబంధాలు కలిగి ఉన్నానని, ఈ ప్రాంత పెద్దన్నగా పార్లమెంట్ సభ్యునిగా ఉన్న సమయంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు.

హుజురాబాద్ అబివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంపూర్ణంగా సహకరిస్తానని తనతో ఓ మాటగా ప్రత్యేకంగా చెప్పారని ఆయన ప్రజలకు వెల్లడించారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని, ఆ తదుపరి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జిల్లా డిసిసి అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే, మేడిపలి సత్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రజల సమగ్ర అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతుందని, హుజురాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Huzurabad Development Medipalli Satyam ponnam prabhakar Praja Palana Telangana Revanth Reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.