హైదరాబాద్ : బోనాల ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల నిధులు విడుదల చేసిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఆషాఢ మాస బోనాలు ఉత్సవాల సందర్భంగా అంబర్పేట మహంకాళి దేవాలయంలో అధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా అంబర్పేటఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి వి.హనుమంత రావుతో కలిసి అంబర్పేట నియోజకవర్గంలోని వివిధ ఆల యాలకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మాట్లాడుతూ అన్ని దేవాలయాల కు ఖర్చు కోసం ఇప్పటికే చెక్కులు (Checks) పంపిణీ చేయడం జరిగింది. జంట నగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరుపున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాల్లో అధికారులు విధి నిర్వహణలో ఎక్కడ లోపం లేకుండా చూసుకోవాలన్నారు. గత సంవత్సరం జరిగిన తప్పిదాలు పునరావృతం జరగకుండా చూసుకోవాలన్నారు. రోడ్డు సమస్యను వర్షం లేనప్పుడు 48 గంటల్లో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈనెల 13వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు (Ujjain’s Mahakali Goddess Bonalu), 20న లాల్దర్వాజా బోనాలు, అంబర్పేట బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు.
3 వేలకు పైగా దేవాలయాల్లో బోనాల ఉత్సవాల పూజలు
జంట నగరాల్లో 3 వేలకు పైగా దేవాలయాల్లో బోనాల ఉత్సవాల పూజలు జరగనున్నాయని, బోనాల ఉత్సవాలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు, చేశామని తెలిపారు. పోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ ,దేవాదాయ శాఖ అధికారులు సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు. ఉత్సవాల్లో విధి నిర్వహణలో ఎక్కడ అలసత్వం లేకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. జల మండలి దేవాలయం వద్ద డ్రైనేజీ లీకేజీలు లేకుండా బోనాల నిర్వాహకులకు చెక్కులు పంపిణి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్, చిత్రంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ ఎంపి వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తదితరులు చూసుకోవాలని, మంచి నీటి పాకెట్ లు అందించాలని చెప్పా రు. ప్రత్యేక జనరేటర్ ఏర్పాటు చేయాలి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. అంబులెన్స్ ఏర్పాటు చేయడంతో పాటు, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి ఫైర్ ఇంజన్ లతో పాటు ఎమర్జెన్సీ బృందాలు ఉండాలన్నారు. ఈ సమావేశంలో, కార్పొరేటర్లు పద్మ, విజయ్ కుమార్ గౌడ్, దూసరి లావణ్యగౌడ, కన్నె ఉమా రమేష్యాదవ్, అమృత, అడిషనల్ కలెక్టర్ జి. ముకుంద రెడ్డి, జోనల్ కమీషనర్ రవి కిరణ్ డిసిపి ఈస్ట్ జోన్ బాలస్వామి, అడిషనల్ డిసిపి నర్సయ్య ట్రఫిక్ డిసిపి అశోక్, ఏసీపీ లు హరీష్ కుమార్, శ్రీనివాస్ . ఇనస్పెక్టర్ కిరణ్ కుమార్, ఎండోమెంట్స్ అడిషనల్ కమీ షనర్ కృష్ణవేణి, ఆర్ జె సి రామకృష్ణ రావు, డిసీ వినోద్ రెడ్డి, జి హ్ ఎంసీ డీసీ మారుతీ దివాకర్, ఏఎంహెచ హేమలత, జలమండలి అధికారులు ప్రభు, టీ శ్రీధర్, విష్ణు వర్ధన్ రావు, తహసీల్దార్ అన్వార్ హుస్సేన్ పాల్గొన్నారు.
పొన్నం ప్రభాకర్ వయస్సు ఎంత?
పొన్నం ప్రభాకర్ గౌడ్ 1967 మే 8న జన్మించారు. 2025 జూలై ప్రస్తుతానికి ఆయన 58 సంవత్సరాలు ఉన్నారు.
పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎవరు?
పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు. 2024‑లలో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రస్తుతం తెలంగాణ రవాణా మరియు BC సంక్షేమ శాఖల మంత్రిగా ఉన్నారు. గతంలో ఆయన 15వ లోక్‌సభ సభ్యులు, అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ (2018–2023)గా సేవలందించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: YSR : త్వరలో అభ్యుదయ రైతులకు వైఎస్ఆర్ పేరుమీద అవార్డులు – భట్టి