📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Ponnam Prabhakar: కీలక పోస్టుల భర్తీకి చర్యలు

Author Icon By Ramya
Updated: July 10, 2025 • 10:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం దృష్టి

హైదరాబాద్ : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి రవాణా శాఖలో పలు కీలక పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. రాజా బహదూర్ వెంకటరామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసిన 96 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ ఔట్ పరేడు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంవిఐల గౌరవ వందనం స్వీకరించి శిక్షణలో అత్యుత్తమ ప్రతిభకనబరిచిన (Awards for AVM) ప్రదానం చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మాట్లాడుతూ.. నాలుగు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న ఏఎంవీఐలకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజా పాలన ప్రభుత్వంలో అనేక ప్రజా యుత కార్యక్రమాలు తెచ్చిందని దాంతో తెలంగాణ రవాణా శాఖ ప్రత్యేక గుర్తింపు సాధించిం దన్నారు. పోలీస్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న పిఎంవీఐలు రోడ్డు ప్రమాదాలు నివారించడానికి మీ శక్తి ఉపయోగించాలని యాక్సిడెంట్లో డెత్ రేట్ తగ్గించాలన్నారు.

Ponnam Prabhakar: కీలక పోస్టుల భర్తీకి చర్యలు

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనతో పాటు కఠిన ఎన్ఫోర్స్‌మెంట్

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాడంతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘన చేస్తున్న వారిపై ఎన్ఫోర్స్ మెంట్ (Enforcement) చేస్తూ కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ( ఏఐ) తీసుకొచ్చి వెహికిల్ ఫిట్నెస్ చేస్తున్నామన్నారు. మీరంతా రవాణా శాఖలోకి రావడంతో ఈ డిపార్ట్ మెంట్ మరింత పటిష్టమైందన్నారు. దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో గాయపడితే క్యాష్ లెస్ ట్రీట్మెంట్ విధానం కేంద్రం తీసుకొచ్చిందని, రోడ్డు ప్రమా దాలు నివారించేలా చర్యలు తీసుకో వాలని ఇప్ప టికే విధుల్లో ఉన్న 300కి పైగా సిబ్బందికి 2నెలలచొప్పున శిక్షణ ఇవ్యాలని ఉన్నతాధికారుల ను ఆదేశించారు. హైదరాబాద్లో ఈవీ, సిఎన్జీ ఎల్సీజ్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నామ న్నారు. దేశంలో రవాణాశాఖలో నియామకం అవుతున్నవారందరికీ మీరు రోల్ మోడల్ గా ఉండాలని, జిల్లా అధికారులతో సమన్వ యం చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకుని మీ తల్లితండ్రులతో పాటు మీ గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

తెలంగాణ రవాణా శాఖ మంత్రి ఎవరు?

తెలంగాణ రాష్ట్రంలో వాహన & సారథి అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.

పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు?

పొన్నం ప్రభాకర్ గౌడ్ (జననం 8 మే 1967) ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు ప్రస్తుతం తెలంగాణలో రవాణా మరియు బిసి సంక్షేమ మంత్రిగా పనిచేస్తున్నారు. గతంలో ఆయన 15వ లోక్‌సభ సభ్యుడు మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: BJP Ramachandra Rao: టిటిడి భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి

AssistantMotorVehicleInspectors Breaking News latest news PassingOutParade PonnamPrabhakar RoadSafety TelanganaGovernment Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.