ఖమ్మం జిల్లాలో సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన నిర్వహించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు వివరాలను వెల్లడించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు, పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
కూసుమంచిలో ప్రైవేట్ కార్యక్రమం
మొదటగా మంత్రి పొంగులేటి కూసుమంచి మండలంలోని పోచారం గ్రామంలో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం. స్థానికంగా జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి పర్యటన సందర్భంగా అభిమానులు భారీగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
ఆ తర్వాత ఖమ్మం రూరల్ నియోజకవర్గంలోని తెల్దారుపల్లి, మద్దులపల్లి, కస్నాతండా, పోలేపల్లిల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరై, పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం రఘునాథపాలెంలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. మంత్రి పర్యటనతో ఖమ్మం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు నూతన ఊపొస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు.
Read Also : Amaravati : వాళ్లిద్దరికీ నోటీసులు ఇస్తాం – మహిళా కమిషన్