📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Ponguleti Srinivasa Reddy: రైతులను ఇబ్బందిపెడితే కఠిన చర్యలు

Author Icon By Ramya
Updated: July 23, 2025 • 5:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దరఖాస్తుల తిరస్కారానికి సరైన కారణాలు చూపాలి.. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy)

హైదరాబాద్ : తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రూపుదిద్దుకున్న భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, సిఎస్ కె. రామకృష్ణారావుతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అద్భుతమైన భూభారతి చట్టాన్ని (Bhubharathi Act) పకడ్బందీగా అమలు చేసినప్పుడే దాని ఫలితాలు సామా న్యులకు అందుతాయని అన్నారు.

Ponguleti Srinivasa Reddy: రైతులను ఇబ్బందిపెడితే కఠిన చర్యలు

రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం జరిగితే కఠిన చర్యలు తప్పవు: అధికారులకు హెచ్చరిక

మూడు దఫాలుగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడానికి సామా న్యులను ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్ప వని సస్సెండ్ చేయడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారనే సమాచారం ఉందని ఇది పునరావృతం కాకుండా చూడాలని కలెక్ట ర్లకు సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో 8.65 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఇందులో ప్రధానంగా సాదాబైనామా, సర్వేనెంబర్ మిస్సింగ్, అసైన్డ్ ల్యాండ్, ఆసైన్డ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్, సక్సెషన్ కు సంబంధించి సుమారు 6 లక్షల దరఖాస్తులు వచ్చాయని వీటిని ఐదు విభాగాలుగా విభజించి ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలన జరిపి ఆగన్లు 15వ తేదీలోగా వీలైనన్ని సమస్యలను పరిష్కరించాల న్నారు. సాదాబైనామాల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని కోర్టు తీర్పుకోసం వేచిచూడకుండా దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం కోసం సిద్ధం చేసుకోవాలన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లకు ప్రభుత్వం సూచనలు

జిల్లాల్లోని ఆసైన్ల్యాండ్, లబ్దిదారుల వివరాలను ఈ నెల 30వ తేదీ లోగా ప్రభుత్వానికి పంపించాలని కలెక్టర్లకు సూచించారు. దరఖాస్తుల సంఖ్యను తగ్గించుకోవడానికి ఇష్టం వచ్చిన రీతిలో తిరస్కరించకూడదని, తిరస్కారానికి గల కారణా లను లిఖిత పూర్వకంగా దరఖాసు దారునికి తెలియజేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈనెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిపీవోలకు, జెఎన్టియు ఆధ్వర్యంలో లైసెన్స్డ్ సర్వేయర్లకు పరీక్ష నిర్వహిస్తున్నామని ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేసుకొని పకడ్బందీగా పరీక్ష నిర్వహించాలన్నారు. పేదవాడి సొంతింటి కల ఇందిరమ్మ ఇండ్ల (Indiramma’s house) నిర్మణానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ధరలు, చెల్లింపులు, ఇసుక, సిమ్మెంట్, స్టీల్ విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏ సమస్య రాకుండా చూడాలని అలాగే ధరల నియంత్రణ కమిటీ చురుగ్గా పనిచేసేలా కలెక్టర్లు నిత్యం పర్యవేక్షించాలన్నారు.

ఇసుక ఉచితం, మట్టిపై కేసులపై ఆంక్షలు – లబ్ధిదారులకు ప్రభుత్వం భరోసా

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అవసరమైన ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, ఇది సరైన విధంగా లబ్దిదారులకు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. లబ్దిదారులపై రవాణా భారం అధికంగా పడకుండా వీలైనంత దగ్గరలో ఇసుక అందేవిధంగా చూడాలన్నారు. బేస్మెంట్ నిర్మాణం కోసం అక్కడక్కడ అందుబా టులో ఉన్న మట్టిని తీసుకెళ్తున్న లబ్దిదారులపై పోలీసులు కేసులు నమోదుచేయడం సరైన చర్య కాదని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ 1. ఎల్ 2, ఎల్ 3 జాబితాలతో సంబంధం లేకుండా నిరుపేదలైతే ఇల్లు కేటాయించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులున్నా కూడా ప్రతి సోమవారం చెల్లింపులు జరుపుతున్నామని అయితే సాంకేతిక సమస్యలతో కొంతమంది లబ్దిదారుల ఖాతాలో డబ్బులు జమ కావడం లేదని ఇటువంటి సమస్యలను ముందుగానే గుర్తించి లబ్దిదారునికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. 2 బిహెచ్కి ఇండ్లకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అర్హులైన లబ్దిదారులకు కేటాయించాలన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Rajagopal : మంత్రి పదవి కంటే కూడా మునుగోడు ప్రజలే ముఖ్యం – రాజగోపాల్

Bhubharathi Act Breaking News District Collector Meeting Indramma House latest news ponguleti srinivasa reddy Revanth Reddy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.