📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Ponguleti Srinivasa Reddy: ఐదు గ్రామాలకు త్వరలో నక్షా మ్యాప్లు : మంత్రి పొంగులేటి

Author Icon By Sharanya
Updated: July 24, 2025 • 3:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: దశాబ్దాలుగా రాష్ట్రంలో నక్షా లేని 413 గ్రామాలకు గాను ఐదు గ్రామాలలో ప్రయోగాత్మకంగా చేపట్టిన రీసర్వేను విజయవంతంగా పూర్తిచేశామని వీలైనంత త్వరి తగతిన 5 గ్రామాల్లో సర్వే బౌండరీస్ యాక్ట్ ప్రకారం నక్షామ్యాప (Land Map)నకు తుదిరూపునిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసం బంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో రీసర్వేపై సిఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, రెవెన్యూ శాఖ కార్యదర్శి వి. లోకేష్ కుమార్, సర్వే ల్యాండ్సెటిల్ మెంట్ కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి సమీక్షించారు.

413 గ్రామాలకు నక్షాలు లేవని

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి (Ponguleti Srinivasa Reddy) మాట్లాడుతూ నిజాం కాలం నుంచి 413 గ్రామాలకు నక్షాలు లేవని గత ప్రభుత్వం పది సంవత్సరాలలో ఈ గ్రామాలను గాలికి వదిలేసిందన్నారు. సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపా లన్నలక్ష్యంతో ప్రయోగాత్మకంగా మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్ నగర్, జగిత్యాల్ జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి (కొత్తది) ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగు మడ, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు, సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం షాహిద్ నగర్ గ్రామాల్లో డ్రోన్, ఏరియల్ మరియు ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ రోవర్ (Truthing Rover) వద్దతు ల్లో సర్వే నిర్వహించామని తెలిపారు. నిబంధనల ప్రకారం భూయజమానులకు నోటీసుల జారీ చేయడం, గ్రామ సభలు నిర్వహించి యజమానుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ప్రతి ఒక్కరి భూములకు సర్వే హద్దులను ఖరారు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

5 గ్రామాల్లో నక్షా మ్యాపులు

ఈ 5 గ్రామాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వే నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల మనోభావాలు, ఆలోచనలకు అనుగుణంగా వారు సంతృప్తి చెందే విధంగా నక్షామ్యాప్ ఉండాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఏం చేసినా అంతిమంగా సామాన్య ప్రజలు, రైతుల సంతోషమే ప్రధానమన్నారు. భూములు అమ్మకం, కొనుగోలు సందర్భంలో హద్దులతో కూడిన సర్వే మ్యాప్ ను ఖచ్చితంగా జత పరచాలని అలాగే దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ నెంబర్ ఎలా ఉంటుందో భూము లకు కూడా భూదార్ నెంబర్ కేటాయించాలని భూభారతి చట్టంలో స్పష్టం చేయడం జరిగిందని ఈ ఐదు గ్రామాలలో ఈ రెండు అంశాలను అమలు చేయాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు. ఈ ఐదు గ్రామాలలో ఐదు గుంటలకు పైగా ఉన్నభూములకు కొత్తగా సర్వేనెంబర్లు ఇవ్వాలని, అలాగే రెవెన్యూ, ఫారెస్ట్, దేవాదాయ, వక్స్ భూములు ఉంటే వాటి వివరాలను కూడా రికార్డులలో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సర్వే ల్యాండ్ సెటిల్మెంట్ జాయింట్ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మీ.5 గ్రామాలకు చెందిన ఆర్టీవోలు, తహశీల్దార్లు, సర్వే ల్యాండ్ సెటిల్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్లు, సర్వే నిర్వహించిన ఏజన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Haribabu: ఎమ్మెల్యే పిఎ హరిబాబు అరెస్టు

5 villages mapping Breaking News Digital maps for villages Gram nakshe plans latest news ponguleti srinivasa reddy Telangana Telugu News Village mapping Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.