నల్లగొండ: పోరాడి సాధించుకున్న తెలంగాణా(Telangana) లో పేదవాడి స్వంత ఇంటి కలను బిఆర్ఎస్ ప్రభుత్వం కలగానే మిగిల్చిందని రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా నకిరేకల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ముఖ్య అతిదిగా హాజరయి లబ్దిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు.
రానున్న మూడున్నర ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లులు
ఈ సంధర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని .. ఇస్తున్నట్లే టివి లలో ,పేపర్లలో ప్రకటనలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టిందని ఆరోపించారు. కానీ పదేళ్ల బిఆర్ఎస్ పాలంలో 93 వేల ఇల్లు మొదలుపెట్టి 66 వేల ఇండ్లు మాత్రమే నిర్మాణం పూర్తిచేసుందని చెప్పారు. మిగిలిన 30 వేలు ఇండ్లు మొండి గోడలతో ఉన్నాయని చెప్పారు. రానున్న మూడున్నర ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. మొదటి విడత లో రాష్ట్రంలోని ప్రతీ నియో జకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 4 లక్షల ఇళ్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇందుకు 22,500 కోట్ల రూపా యల బడ్జెట్ కేటాయించినట్లు ఆయన చెప్పారు. ఇంటి నిర్మాణం చేపట్టిన ప్రతి లబ్దిదారుడికి రూ 5 లక్షలు 4 దఫాలుగా ఇంటి నిర్మాణ స్టేజిని బట్టి మద్య దళార్లు లేకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం లో చేపట్టిన అసంపూర్తి ఇళ్లకు లబ్దిదారులను ఎంపిక చేసి ఆ వివరాలను ఆన్ లైన్ చేయాలని అన్నీ జిల్లాల కలెక్టర్ లకు సూచించారు. వివరాలు అందగానే బడ్జెట్ విడుదల చేసి ఆ ఇళ్లను కూడా పేదలకు అందించనున్నట్లు ప్రకటించారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పేరుతో అక్రమార్కులతో కలిసి రాష్ట్రంలోని భూయజమాను లను ఇబ్బందులకు గురుచేశారని అక్రమ పాసు బుక్కులతో రైతుబందు లబ్దిదారులగా చెలామణి అయ్యారని అందుకే, ధరణి రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. భూభారతి చట్టం భూములున్న ఆసాములకు చుట్టమయిందని … ఇప్పటి వరకు 8 లక్షల 60 వేల ధరఖాస్తులు అందాయని ఆగస్టు 15 నాటికి భూభారతి లో నమోదైన న్యాయమైన దరఖాస్తులన్నింటిని పరిష్కరించి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.
త్రాగు, సాగు నీటి సమస్య పరిష్కారం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో త్రాగు, సాగు నీటి సమస్య పరిష్కారం కోసం అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టును పదేళ్ళ పాటు పట్టించుకోలేదని పాత ప్రాజెక్టులో కమీషన్ లు రావని … కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టి లక్ష కోట్లు పైన దిగమింగారని మంత్రి ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో గుత్తా సుఖేందర్ రెడ్డి,
చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్య, శంకర్ నాయక్ బత్తుల లక్ష్మా రెడ్డి, కుంభం అనిల్ కుమార్ నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాటి. భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read also: Telangana: రైతుల చూపు.. ఆకాశం వైపు..