📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Ponguleti Srinivasa Reddy: ప్రతి మండలానికి 46 మంది లైసెన్స్ డ్ సర్వేయర్లు : మంత్రి పొంగులేటి

Author Icon By Sharanya
Updated: July 12, 2025 • 5:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జిపిఒ

హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతంచేసి భూ సమస్య లపై సామాన్యులకు మెరుగైన సేవలందిం చడానికి వీలుగా సిఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి జీపీవో (GPO for revenue village), ప్రతి మండలానికి భూ విస్తీర్ణాన్ని బట్టి4 నుంచి 6మంది వరకు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు.

రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ ఇందుకు సంబం నిర్వహిస్తామని తర్వాత 28, 29 తేదీల్లో జెఎన్టియు ఆధ్వర్యంలో ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహిస్తామని, ఆగస్టు 12వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. తుది పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 40 రోజుల పాటు అప్రెంటిస్ శిక్షణ ఉంటుందని తెలిపారు. భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ (Survey Map) తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు అవసరమైన సర్వేయర్లను అందుబాటులోకి తీసుకురావలన్న లక్ష్యంతో లైసెన్స్డ్ డ్ సర్వేయర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా 10 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని ఇందులో తొలివిడతలో 7వేల మందికి 33 కేంద్రాల్లో మే 26వ తేదీనుంచి శిక్షణ అంధించి ఈనెల 26తో 50 రోజుల శిక్షణ పూర్తవుతుందని తెలిపారు. మిగిలిన 3వేల మందికి ఆగస్టు 2వ వారం నుంచి శిక్షణ ప్రారంభిస్తామని తెలిపారు.

రెవెన్యూ, సర్వే విభాగానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని, సర్వేవిభాగం బలోపేతంతో రెవెన్యూ వ్యవస్థలో మెరుగైన సేవలు అందించగలుగు తామని దీనిని దృష్టిలో పెట్టుకొని సర్వేవిభాగాన్ని బలోపేతం చేస్తున్నా మన్నారు. మరోసారి అవకాశం కల్పించాలన్న రెవెన్యూ సంఘాల అభ్యర్ధన మేరకు ఈనెల 27న మరోసారి వీరికి అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ఐదు నక్షా గ్రామాల్లో రీసర్వే పూర్తి గత ప్రభుత్వం నక్షా లేని గ్రామాలను గాలికి వదిలేస్తే సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో నక్షా లేని 413 గ్రామాలకు గాను 5 గ్రామాలలో ప్రయోగాత్మకంగా రీ సర్వేను విజయవంతంగా పూర్తి చేశామన్నారు .

పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏ మంత్రి?

పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన 2023 డిసెంబర్ 7వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆదాయ శాఖ, గృహ నిర్మాణం, సమాచార మరియు ప్రజాసంబంధాల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Jitender Reddy: కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్ కోశాధికారిగా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి?

Breaking News Land survey updates Telangana latest news Licensed surveyors Mandal level land services ponguleti srinivasa reddy Revenue reforms Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.