📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News telugu: Ponguleti Srinivasa Reddy: వరదసహాయ చర్యలను ముమ్మరం చేయండి:పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Author Icon By Sharanya
Updated: September 11, 2025 • 3:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: ఇటీవల రాష్ట్రంలో డు ప్రధానంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురిసిన భారీ న్ని వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ రు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)సూచనలతో డాక్టర్.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో భారీ వర్షాలతో జరిగిన నష్టం, ఇప్పటివరకు తీసుకున్న సహాయక చర్యలపై ఆయా శాఖలవారీగా – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు. రాష్ట్ర ప్రకృతి వివత్తుల నిర్వహణా విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్థిక శాఖ ప్రధాన కార్య 1 దర్శి సుల్తానియాతో కలిసి సమావేశం నిర్వహించారు.

News telugu

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టం తగ్గిందన్నారు. సహాయక పనులను మరింత వేగవంతం చేయాలని ఇప్పటివరకు వరిహారాలను విడుదల చేయక పోతే వాటిని వెంటనే విడుదల చేయాలని అధికారులకు సూచించారు. ఏ ఒక్క బాధితుడు పరిహారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు రూ.10 కోట్లు, సాధారణ నష్టం జరిగిన జిల్లా లకు రూ.5 కోట్లను విడుదల చేశామన్నారు. సహాయక చర్యలను ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని హైదరాబాద్ నుంచి ఆయా విభాగాధిపతులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వరద సహాయానికి (For flood relief) సంబంధించి వినియోగించిన నిధులకు యూసీలను కేంద్రానికి అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రని సమావేశంలో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 13వ తేదీలోగా ఆయా విభాగాలు యూసీలను సమర్పించాలని ఆదేశించారు. అల్పపీడనం కారణంగా వచ్చే రెండు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమా వేశంలో ఇరిగేషన్, పంచాయితీరాజ్, హెల్త్, మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


జర్నలిస్టుల సమస్యలపై మంత్రి పొంగులేటి సమీక్ష నిజమైన జర్నలిస్టులకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర. సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికా దులకు సూచించారు. సచివాలయంలో ప్రెస్ ఆకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, పిఆర్ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక, సీపీఆర్వో జి. మల్సూర్తో కలిసి సమీక్ష నిర్వ హించారు. ఈ సమావేశంలో ప్రధానంగా అక్రిడిటేషన్ పాలసీ, జర్నలిస్ట్ల హెల్త్ పాలసీ, జర్నలిస్టుల అవార్డులు, జర్నలిస్టులపై దాడులకు సంబంధించి హైపవర్ కమిటీ తదతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశాలపై కార్మిక, ఆరోగ్య, హోం, ఆర్థికశాఖ అధికా రులతో త్వరలో మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/triple-it-basara-triple-it-gets-a-new-look/telangana/545208/

Breaking News DisasterManagement FloodRelief latest news PonguletiSrinivasaReddy TelanganaFloods Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.