📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Ponguleti Srinivas Reddy : పొంగులేటి శ్రీనివాసరెడ్డి పీఏలమని చెప్పి మోసాలు

Author Icon By Divya Vani M
Updated: April 25, 2025 • 8:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇద్దరు మోసగాళ్లు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రిని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు వాడుకుని, వారు అధికారులను మోసం చేయాలని చూస్తూ వసూళ్లకు పాల్పడ్డారు. చివరకు పోలీసులు ఈ తతంగాన్ని గుర్తించి అరెస్టు చేశారు.హైదరాబాద్ నగరంలోని నాగోల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అరెస్టయిన వారు బుస్సా వెంకటరెడ్డి, మచ్చ సురేశ్ అనే ఇద్దరు వ్యక్తులు. వీరిలో సురేశ్, చిల్పూర్ మండలంలోని పల్లగుట్టకు చెందినవాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వెంకటరెడ్డి మాత్రం భూపాలపల్లి జిల్లా చిట్యాల ప్రాంతానికి చెందినవాడు.ఈ ఇద్దరూ కొంతకాలంగా మంత్రి పర్సనల్ అసిస్టెంట్లమని అధికారులను ఫోన్ చేసి మోసం చేస్తూ వస్తున్నారు. సురేశ్ తన మొబైల్ నంబర్ ద్వారా పలు పోలీస్ అధికారులకు ఫోన్లు చేశాడు. మార్చి 29న చౌటుప్పల్ సీఐకి ఫోన్ చేసి ఒక కేసుకు సంబంధించి పోస్టుమార్టం నివేదికను కోరాడు. నార్సింగి పోలీసులకు ఫోన్ చేసి సివిల్ కేసులో సహకరించాలని విన్నవించాడు.

Ponguleti Srinivas Reddy పొంగులేటి శ్రీనివాసరెడ్డి పీఏలమని చెప్పి మోసాలు

ఇంతటితో ఆగలేదు. సికింద్రాబాద్ జేబీఎస్ ఆఫీసర్‌ను సంప్రదించి డ్రైవర్ బదిలీ గురించి ప్రస్తావించాడు. అలాగే ఘట్‌కేసర్ ఎక్సైజ్ సీఐకి గంజాయి కేసులో పట్టుబడిన వాహనం విడుదల చేయమంటూ ఒత్తిడి చేసాడు. ఓ డిగ్రీ కాలేజీకి సీటు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ వద్ద రూ.10 లక్షల రుణం కోసం కూడా ఫోన్లు చేశాడట.ఇక బుస్సా వెంకటరెడ్డి కూడా అదే మాదిరిగా వ్యవహరించాడు. గోపాలపురం ఎస్సై నుంచి ఉప్పల్ సీఐ వరకు పలు అధికారులకు ఫోన్లు చేశాడు. పలు పనుల విషయంలో సహకరించాలని కోరుతూ ఒత్తిడి తేవడమే కాకుండా, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే పీఏకు కూడా ఫోన్ చేశాడు.ఇలాంటి ఫోన్లు అనుమానం కలిగించిన అధికారుల కొంతమంది నిజాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ నరేశ్‌ను సంప్రదించారు. నరేశ్ చేసిన పరిశీలనలో అసలు వీరిద్దరూ మంత్రికి సంబంధించినవారు కాదని స్పష్టమైంది. వెంటనే ఆయన నాగోల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు టెక్నాలజీ ఆధారంగా మోసగాళ్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.ఈ పరిణామంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. తన పేరు వాడి ఎవరైనా మోసం చేస్తే తాను ఉపేక్షించనని ఆయన చెప్పారు. “ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే, నా కార్యాలయ నంబర్లకు వెంటనే సమాచారం ఇవ్వండి” అని 040-23451072, 040-23451073 నంబర్లను ప్రకటించారు.

Read Also : Cabinet Expansion : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశంపై టీపీసీసీ చీఫ్ ఏమన్నాడంటే

Cyber crime Hyderabad news Hyderabad latest crime news Minister name misuse case Ponugoti Srinivas Reddy PA scam Telangana revenue minister news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.