ఎన్నికలు పూర్తయ్యాక రాజకీయ భేదాలు పక్కన పెట్టి ప్రజల సేవే ముఖ్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ కార్యాలయంలో పుర ఛైర్‌పర్సన్‌గా ఎంపికైన పోకబత్తిని అనిత బాధ్యతల స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రజా ప్రతినిధుల పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు నమ్మి ఓటేశారని, కుర్చీలకే పరిమితం కాకుండా బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా ఏదులాపురాన్ని తీర్చిదిద్దుతామన్నారు.
Read Also: Harvard ai policy symposium : హార్వర్డ్ వేదికపై సీఎం రేవంత్, భారత్ నుంచి ఏకైక ఆహ్వానం
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: