📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Today News : Politics – ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఊహించని ఫలితాలుంటాయి – ఎంపి మల్లు రవి

Author Icon By Shravan
Updated: August 22, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ Politics : త్వరలో జరగబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో (Vice Presidential election) ఊహించని ఫలితాలు ఉంటాయని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. తెలుగు ఎంపిలంతా ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికే మద్దతు ఇవ్వాలని విజప్తి చేశారు. సుదర్శన్ రెడ్డి గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎంపి మల్లు రవి ఢిల్లీలోని తెలంగాణ భవన్లో విలేఖరులతో మాట్లాడారు. తెలుగు ఎంపిలు కృషి చేయాలని కోరారు. సుదర్శన్ రెడ్డికి ఏ పార్టీలో సభ్యత్వం లేదు. రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన గెలుపు కోసం తెలుగు ఎంపిలంతా కృషి చేయాలి. సుదర్శన్ రెడ్డి త్వరలోనే పలు రాష్ట్రాల్లో పర్యటిస్తారు. తనకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీలను, ఎంపిలను కోరతారు. ఈ ఎన్నికల్లో విప్ ఉండదు. కాబట్టి ఎంపీలు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం వినియోగించు కుంటారని ఆశిస్తున్నామని అని మల్లు వివరించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి త్వరలో ఉత్త రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్తారు.

సుదర్శన్ రెడ్డికి అన్ని పార్టీల మద్దతు కావాలి, కేంద్రంపై తెలంగాణ ఎంపీల లేఖలు

Politics – ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఊహించని ఫలితాలుంటాయి – ఎంపి మల్లు రవి

యూపీలో అఖిలేష్ యాదవ్, బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ మద్దతు కోరతారు. అలాగే ఇండియా కూటమి ఎంపీల మద్దతు కోరతారు. తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్ నేను కూడా సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) గెలుపు కోసం ఎంపీల మద్దతు కోరతానని మల్లు రవి స్పష్టం చేశారు. చంద్రబాబు కృతజ్ఞత చూపాలి: ఎన్టీఆర్, చంద్రబాబు మధ్య పార్టీ గుర్తు కోసం కేసు నడిచిన సమయంలో సుదర్శన్ రెడ్డి సుప్రీం కోర్టులోన్యాయ మూర్తిగా ఉన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు చంద్రబాబు కృతజుత చూపాల్సిన సమయం వచ్చిందని రవి వ్యాఖ్యానించారు. సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని మేము అన్ని పార్టీలను, ఎంపీలను విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఆయన జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో కీలక తీర్పులను చెప్పారు. ఆయన ఎప్పుడూ ప్రజల కోణం లో ఆలోచించే వ్యక్తి అని మల్లు రవి వ్యాఖ్యానించారు. తెలుగు కేంద్ర మంత్రులకు లేఖలు రాస్తామని తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభలను నిర్వహించడంలో బిజెపి ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శించారు ప్లాన్ ప్రకారం సభల్లో గందరగోళ పరిస్థితులు సృష్టించారని మల్లు రవి ఆరోపించారు. అలాగే తెలంగాణ ఎంపీలంతా కలిసి కీలక అంశాలపై కేంద్ర ప్రభు త్వానికి లేఖలు రాసినట్టు వివరించారు మల్లు రవి. విభజన సమస్యల పరిష్కారం, సెమీకండక్టర్ యూనిట్స్, తెలంగాణలో ఎయిర్ పోర్టులు, మూసీనదీ ప్రక్షాళన వంటి అంశాలపై సంబంధిత మంత్రులకు లేఖలు రాసినట్టు వెల్లడించారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/tragedy-three-mba-students-drown-in-cheyeru-river/andhra-pradesh/534537/

Breaking News in Telugu Latest News in Telugu MP Mallu Ravi Parliament News Telugu News Paper Unexpected Results Vice President Elections 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.