Manchireddy Kishan Reddy: తెలంగాణలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఒక కౌన్సిలర్‌ను అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణలపై వీరిద్దరికీ నోటీసులు అందాయి. క్రైం నెంబర్ 119/2026 కింద BNSS సెక్షన్ 35(3) ప్రకారం పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.కౌన్సిలర్ ఎన్నికల సర్టిఫికేట్, మొబైల్ ఫోన్ బలవంతంగా లాక్కొని, బాధితుడిని మూడు రోజుల పాటు నిర్బంధించారని ఆరోపణలున్నాయి.
Read Also: Srisailam fire accident : శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలి
తాజాగా, జారీ చేసిన నోటీసులకు సంబంధించి మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. కిడ్నాప్ (Kidnap) కేసులో విచారణకు హాజరై తమ వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా స్పందించని పక్షంలో బాధ్యులపై చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడికి ఒకేసారి నోటీసులు జారీ కావడంతో ఇబ్రహీంపట్నం పాలిటిక్స్లో ఉత్కంఠ నెలకొంది. ఈ కిడ్నాప్ వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో పోలీసుల విచారణలో బహిర్గతం కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: