తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) పలువురు జాగృతి నేతలు హైదరాబాద్‌లోని లక్డీకపూల్ సింగరేణి భవన్‌ను ముట్టడించడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు కవితతోపాటు పలువురు జాగృతి నేతల్ని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ సింగరేణి భవన్ ముట్టడికి పిలుపునిచారు కవిత.
Read Also: Overload Auto: బాబోయ్! ఇది ఆటోనా.. లేక లారీనా..?
లక్డీకపూల్ వద్ద ఉద్రిక్తత: తెలంగాణ జాగృతి నాయకులు అరెస్టు
ఈ క్రమంలో సింగరేణి భవన్ (Singareni Bhavan) ముట్టడిలో పాల్గొన్న కవిత (Kavitha) రోడ్డుపై బైఠాయించారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: