📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Terrorist conspiracy :తెలుగు రాష్ట్రాల్లో ఉగ్ర కుట్ర.. ఛేదించిన పోలీసులు

Author Icon By Sudha
Updated: May 19, 2025 • 1:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తాజాగా, హైదరాబాద్‌లో (Hyderabad) భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన ఇద్దరు వ్యక్తులను తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరానికి (vijayanagaram)చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ మరియు హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్‌లు, పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి, నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు గుర్తించారు.

Terrorist conspiracy :తెలుగు రాష్ట్రాల్లో ఉగ్ర కుట్ర.. ఛేదించిన పోలీసులు


భారీ పేలుళ్లకు ఫ్లాన్
పహల్గామ్‌ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల డెన్‌లను భారత సైనికులు నేలమట్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో 100మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్‌ యాక్టివ్‌ అయ్యాయి. సౌదీ అరేబియా ఐసిస్‌ నెట్ వర్క్‌ (Saudi Arabia ISIS network)నుంచి ఆదేశాలు అందుకున్న సిరాజ్, సమీర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్రపన్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్‌ కలిసి నగరంలో భారీ పేలుళ్లకు ఫ్లాన్ చేశారు. ఇందు కోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశారు. ఉగ్రవాదుల పన్నాగాన్ని పసిగిట్టిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటన, “ఆపరేషన్ సింధూర్” తర్వాత తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతున్నట్లు సూచిస్తోంది. ఇండియా-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యాన్ని కలిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు అప్రమత్తంగా చర్యలు కొనసాగిస్తున్నారు .
NIA అధికారులు దర్యాప్తు
ఇంతకు ముందు, 2022లో, హైదరాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై మానవబాంబు దాడి జరిగింది. ఆ సమయంలో, పాక్ నుంచి గ్రనేడ్లు, సెల్‌ఫోన్లు, మరియు రూ. 39 లక్షల నగదు హవాలా మార్గంలో వచ్చినట్లు గుర్తించారు. ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేసింది .హైదరాబాద్‌లో గతంలోనూ దిల్ సుఖ్‌నగర్, గోకుల్‌ చాట్ పేలుళ్లు జరిగాయి. ఇప్పుడు సిరాజ్‌, సమీర్ పేలుళ్లకు కుట్ర పన్నారు. దీంతో ఉగ్ర కుట్రను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. పేలుళ్ల కుట్రలో ఇంకెంతమంది ఉన్నారన్న కోణంలో పోలీసులు, NIA అధికారులు దర్యాప్తు చేస్తోన్నారు.
తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం చాలా పటిష్టంగా, అలర్ట్‌గా ఉందన్నారు పోలీసులు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు పోలీసులు.

Read Also : Former Brazilian President: బోల్సోనారోపై తిరుగుబాటు ఆరోపణలపై విచారణ

Breaking News in Telugu Google news Google News in Telugu in Telugu states Latest News in Telugu Paper Telugu News Police foil terror plot Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.