భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అనేకమంది వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్య్రం కోసం పోరాడారు. అయితే ఆ జాబితాలో ఒక మహా యోధుని పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆ పేరు కొమురం భీమ్ (Komuram Bheem).
తెలంగాణ గిరిజన గౌరవం, హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన ఈ మహనీయుడిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తాజా “మన్ కీ బాత్” కార్యక్రమంలో స్మరించుకున్నారు..
Read Also: Upliance.ai: ఇండియాలోకి వచ్చిన AI కుకింగ్ అసిస్టెంట్
మోదీ (PM Modi) మాట్లాడుతూ, “బ్రిటిష్ దోపిడీ, నిజాం అణచివేత పీక్ స్థాయిలో ఉన్న సమయంలో కేవలం 20 ఏళ్ల యువకుడు స్వగ్రామం, తన మనుషుల హక్కుల కోసం ధైర్యంగా నిలిబడ్డాడు. ప్రతిఘటనలో నిజాం అధికారిని కూడా హతమార్చి, పట్టుబడకుండా అడవుల్లో తన పోరాటాన్ని కొనసాగించాడు.
తాజాగా అక్టోబర్ 22 న కొమురం భీమ్ జయంతి జరుపుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని, “ఆయన పేరును ప్రతి యువకుడు వినాలి, ఆయన పోరాటం గురించి తెలుసుకోవాలి, అది మనకు ధైర్యం, స్వాభిమానాన్ని నేర్పుతుంది” అని పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: