తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు పరిపాలనను వికేంద్రీకరించి, 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించింది. నూతనంగా నియమితులైన జోనల్ కమిషనర్లతో ఇంటిగ్రెటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన కీలక సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నగరంలో చెత్త నిర్వహణ అనేది అత్యంత సంక్లిష్టమైన సమస్యగా మారిందని, దీనిపై జోనల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించారు. రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకూడదు, గుంతలు ఉండకూడదని ఆయన కరాఖండిగా చెప్పారు.
Read Also: Hyderabad: క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్
ప్లాస్టిక్ రహిత నగరం
ప్రతీ నెలా మూడు రోజుల పాటు శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, ప్రతి పది రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్లాస్టిక్ (Plastic Ban) రహిత నగరంగా మార్చడమే లక్ష్యమని.. దశల వారీగా ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కోర్ అర్బన్ ఏరియాలో డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు, ఆటోలను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: