📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Fight: ప్లాంటేషన్ పోడులో ఘర్షణ..ఫోరెస్టు వర్సెస్ పోడుదారులు

Author Icon By Vanipushpa
Updated: July 17, 2025 • 12:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కారేపల్లి (ఖమ్మం): సింగరేణి మండలం(Singareni Mandal) మాణిక్యారాఎర్రబోడు (Manikyarayerrabodu) ఊటవాగు సమీపంలోని ప్లాంటేషన్ పోడు లో పోడుదారులు, ఫారెస్టు అధికారుల(Forest Officers) మధ్య బుధవారం ఘర్షణ జరిగింది. పోడులో పోడుదారులు వేసుకున్న గుడిసెలను తొలగించే క్రమం ఇరువర్గాల మధ్య తోపులాట, నెట్టుకోవటం చోటుచేసుకుంది. మహిళలను చూడకుండా ఫారెస్టు అధికారులు మహిళ పోడుదారులపై దాడికి దిగారు. అదే స్థాయిలో పోడుదారులు ప్రతిఘటించారు. ఐదేండ్లుగా ప్లాంటేషన్ పోడు సమస్య ఫారెస్టు అధికారుల నాన్చుదోరణితో జఠిలం అయింది. ప్రత్యామ్నాయ పోడు చూపుతామని 2020లో ప్లాంటేషన్ కోసం 50 హెక్టార్ల పోడును 60 మంది పోడుదారుల నుండి సేకరించారు.

ప్లాంటేషన్ పోడులో ఘర్షణ..ఫోరెస్టు వర్సెస్ పోడుదారులు

మూడేండ్లుగా ప్లాంటేషన్ పోడులో ఉద్రిక్తత పరిస్థితిలు

పోడు నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపకుండా దాటవేత ద్రోరణి అవలంభిస్తుండటంతో మూడేండ్లుగా ప్లాంటేషన్ పోడులో ఉద్రిక్తత పరిస్థితిలు నెలకొంటున్నాయి. ఈ ఏడాది సైతం పోడుదారులు పోడులో విత్తనాలు వేసి అక్కడే గుడెసెలు వేసుకోని ఉంటున్నారు. దీనిపై ఎఫ్ఎవో సైతం ఆప్రాంతాన్ని సందర్శించి ఐదు రోజులలో దానిపై నిర్ణయం తీసుకుంటాని తెల్పారు. అయినా ఎటువంటి చర్యలు లేక పోవటంతో పోడుదారులు ప్లాంటేషన్ పోడు సాగుకు ఉపక్రమించారు. చర్చలకు పిలిచి గుడిసె పీకేయత్నం పోడుదారులను, ప్రజాసం ఘాల నాయకులను ఎఫ్ఎవో వస్తున్నారు. చర్చలకు రావాలని రేంజ్ కార్యాలయం నుండి పిలిచారు. చర్చలకు ప్రజాసంఘాల నాయక్కులెన కే.నరేంద్ర, వజ్జా రామారావు, అజ్మీర శోభన్నాయక్ లు పోడు వద్దకు వచ్చారు.

గుడిసెను తీసివేయాలని డిమాండ్

పోడుదారులతో చర్చలు చేయకుండానే ఎఫ్ఎర్వో ఎఫ్ఎస్వో లు చక్రవర్తి, వీరభద్రం ఆధ్వర్యంలో ఫారెస్టు అధికారులు ప్లాంటేషన్కు చేరుకోని అక్కడి ఉన్న గుడిసెను తీసివేయాలని డిమాండ్ చేయటంతో పాటు దానిని పీకటంతోపాటు అరక వస్తువులను ధ్వంసంకు ప్రయత్నించటంతో మహిళా పోడుదారులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య మాటామాట పెరిగింది. కరపటి అరుణ, మల్లమ్మ అనే మహిళలను ఫారెస్టు అధికారులు నెట్టివేయటంతో ఘర్షణ జరిగింది. మహిళలని చూడకుండా మగ ఫారెస్టు అధికా రులు దౌర్జన్యం చేశారు. అదే స్థాయిలో పోడు దారులు ఎదురించి నిలిచారు. ప్రజాసంఘాల నాయకులు కే. నరేంద్ర, వజ్జా రామారావు, అజ్మీర శోభన్ లు ఘర్షణను నివారించే ప్రయత్నం చేసినా ఫారెస్టు అధికారులు మొండిగా వ్యవహరించి మహిళలపై దౌర్జంకు దిగారు. పోడులో ఘర్షణ విషయం తెలుసుకున్న కారేపల్లి ఎస్సై బీ.గోపి సంఘట స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను సముదాయించారు. విషయాన్ని ఫారెస్టు డివిజన్ అధికారి దృష్టికి తీసుకెళ్ళారు. సమస్య పరిష్కారంకు రెండు రోజుల గడువు కోరారు. అప్పటి వరకు ఇరు వర్గాలు ఆ ప్రాం తంలో ఎలాంటి పనులు చేపట్టవద్దని ఎస్సై గోపి సూచించారు. దీంతో ఇరువర్గాలు అక్కడి నుండి వెళ్ళిపోయారు. దీనిపై ఇరువర్గాలు కారేపల్లి పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు .

అడవి అంటే ఏమిటి?

అడవి అంటే వివిధ వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ మొక్కలు మరియు జంతువులు సహజంగా పెరిగే భూభాగం. ప్రత్యేక లక్షణాలను బట్టి, మడ అడవులు, ఉష్ణమండల వర్షారణ్యాలు మొదలైన వివిధ రకాల అడవులు ఉన్నాయి. 150 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో ఉష్ణమండల సతత హరిత అడవులు పెరుగుతాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Bandh : జులై 23న తెలంగాణ లో స్కూల్స్, కాలేజీలు బంద్

#telugu News Forest Department Forest Encroachment Forest Rights Land Dispute Plantation Clash Podu Farmers Telangana news Telangana Tribal Issues Tribal Protests

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.