📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

గజ్వేల్‌లో పోటాపోటీ బహిరంగసభలకు ప్లాన్..!

Author Icon By sumalatha chinthakayala
Updated: February 7, 2025 • 7:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: గజ్వేల్‌లో పోటాపోటీ బహిరంగసభలకు రేవంత్, కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో భారీ బహిరంగసభ పెట్టుకుందాం అని కేసీఆర్ ఇటీవల తన ను కలిసిన పార్టీ నేతలకు చెప్పారు. ఆ బహిరంగసభ గజ్వేల్‌లోనే అని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా తేదీ ఖరారు చేయలేదు. కాంగ్రెస్ కూడా గజ్వేల్ లోనే బహిరంగసభకు ప్లాన్ చేస్తోంది. కులగణనను సక్సెస్ చేసినందుకు ఈ సభను నిర్వహించాలని అనుకుంటున్నారు. దీంతో గజ్వేల్ వేదికగా రెండు పార్టీలు రాజకీయంగా యుద్ధానికి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

రేవంత్ రెడ్డి సీఎంగా యాక్టివ్ గా ఉండగా.. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఫామ్ హౌస్ కే పరిమితయ్యారు. ఇప్పటికి పదిహేను నెలలే రేయింది రేవంత్ అధికారంలోకి వచ్చి. అందుకే కొంత సమయం ఇద్దామని కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారు.. ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా రావడంతో ఇక రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నారు. అంటే ఇరువురు ఇక తమ దంగల్ ను గజ్వేల్ నుంచి ప్రారంభిస్తారు. ఇక తెలంగాణ రాజకీయం ఈ స్థానిక ఎన్నికల నుంచే వేడి మీద సాగనుంది.

కాగా, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూండటంతో పార్టీని యాక్టివ్ చేయడానికి కేసీఆర్ బహిరంగసభకు ప్లాన్ చేశారు. ఇటీవల తనను కలిసిన క్యాడర్ కు అదే చెప్పారు. కేటీఆర్, కవిత, హరీష్‌రావు ప్రజల్లో ఉన్నా కేసీఆర్ తెరపైకి వస్తే వచ్చే ఊపు వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చిందని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 5 లక్షల మందితో బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. కేసీఆర్-హరీష్‌రావు నియోజకవర్గాలు పక్కపక్కనే ఉండడంతో జనాన్ని భారీగా సమీకరించవచ్చని భావిస్తోంది. ఈ సభ సక్సెస్ అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయన్నది కారు పార్టీ కీలక నేతల అంచనా.

brs congress Gajwel Google news KCR open meetings Revanth Reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.