📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

Physiotherapy: తెలంగాణ వృద్దులకు ఉచితంగా ఫిజియోథెరపీ సేవలు..

Author Icon By Anusha
Updated: August 4, 2025 • 5:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వృద్ధ పౌరుల కోసం ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ పథకాలను అమలు చేస్తోంది. ఆ దిశగా ఈ ఏడాది మే నెలలో రాష్ట్రంలోని 33 జిల్లాల బోధనాస్పత్రుల్లో జెరియాట్రిక్ వార్డులు ప్రారంభించడం ఒక ముఖ్యమైన అడుగు. వృద్ధులకు ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించడం, వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటం, అవసరమైన చికిత్సను సమయానికి అందించడం ఈ వార్డుల ప్రధాన లక్ష్యం.ప్రతి జెరియాట్రిక్ వార్డు (Geriatric ward) లో పదే పదకలతో కూడిన ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. వృద్ధుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వైద్య పరికరాలు, ప్రత్యేక నర్సింగ్ సిబ్బంది, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ వార్డులు పనిచేస్తున్నాయి. వృద్ధులలో సాధారణంగా కనిపించే వ్యాధులు – హై బ్లడ్ ప్రెజర్, షుగర్, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, వయో సంబంధిత మానసిక సమస్యలు – ఇవన్నింటికీ ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నారు.

వృద్ధుల విశ్వాసం ఎంత పెరిగిందో స్పష్టంగా

వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, కేవలం రెండు నెలల్లోనే లక్షలాది మంది వృద్ధులు ఈ వార్డుల ద్వారా సేవలు పొందారు. ఇందులో 2,59,880 మంది ఔట్‌పేషెంట్ సేవలు, 32,313 మంది ఇన్‌పేషెంట్ సేవలు, 19,685 మంది ఫిజియోథెరపీ సేవలు వినియోగించుకున్నారు. ఈ సంఖ్యలు జెరియాట్రిక్ వార్డులపై వృద్ధుల విశ్వాసం ఎంత పెరిగిందో స్పష్టంగా చూపిస్తున్నాయి.ముఖ్యంగా ఆర్థో, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, మానసిక వైద్య సేవలు పొందుతున్న వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వృద్ధాప్యంలో మోకాళ్లు, ఇతర కీళ్ల నొప్పులు సాధారణ సమస్య. వీటికి ఫిజియోథెరపీ (Physiotherapy) ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో సెషన్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకు ఖర్చవుతుంది. కానీ జెరియాట్రిక్ వార్డుల్లో ఈ సేవలు పూర్తిగా ఉచితంగా లభిస్తున్నాయి. ఇది వృద్ధులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా మారింది.

Physiotherapy:

వృద్ధుల కోసం

జెరియాట్రిక్ వార్డులతో పాటు, వైద్యారోగ్య శాఖ వృద్ధుల కోసం మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది.ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, బస్తీ దవాఖానాల్లో ప్రతి గురువారం వృద్ధుల కోసం ప్రత్యేక క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. పల్లె, బస్తీ దవాఖానాలకు రాలేని వృద్ధులకు ఇంటివద్దకే వెళ్లి వైద్య సేవలు అందించాలని వైద్యశాఖ ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ, డయాగ్నొస్టిక్ కేంద్రాల వద్ద వృద్ధులకు క్యూలో నిలబడకుండా ప్రత్యేక సేవలు అందించాలని సూచించింది. ఈ వినూత్న కార్యక్రమం తెలంగాణలోని వృద్ధులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఫిజియోథెరపీ అంటే ఏమిటి?

శరీరంలో కండరాలు, నరాలు, ఎముకలు, కీళ్లకు సంబంధించిన సమస్యలను వ్యాయామాలు, మసాజ్, మాన్యువల్ థెరపీ, ప్రత్యేక పరికరాల సాయంతో చికిత్స చేయడాన్ని ఫిజియోథెరపీ అంటారు.

ఫిజియోథెరపీ ద్వారా ఎలాంటి వ్యాధులను నయం చేయవచ్చు?

నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాలి నొప్పి, ఫ్రాక్చర్ తర్వాతి సమస్యలు, స్ట్రోక్‌ తర్వాత శరీర బలహీనత, క్రీడల గాయాలు, ఆర్థరైటిస్, పక్షవాతం వంటి అనేక సమస్యలకు ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/komatireddy-accuses-kcr-harish-of-massive-corruption/telangana/525907/

Breaking News Elderly Healthcare Elderly Patients Geriatric Wards Health Care for Seniors latest news medical services OP Services Telangana telangana government Telangana Hospitals

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.