📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Phone tapping: ఫోన్ ట్యాపింగ్ పై యేడాదిన్నరగా సాగుతున్న విచారణ

Author Icon By Sharanya
Updated: July 10, 2025 • 12:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం రేపిన ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) వ్యవహారం ఏడాదికి పైగా రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో దీని విధి విధానాలపై మరోసారి చర్చ మొదలయ్యింది. దేశంలో ఫోన్ ట్యాపింగ్ బ్రిటీష్ కాలం నుంచే అమల్లో వుండగా దేశానికి స్వాతంత్రం వచ్చాక కూడా ప టిష్ట చట్టాల మధ్య పరిమితంగా అమలు చేయసాగారు. ఉమ్మడి ఎపి వరకు వస్తే 1980 దశకంలో మావోయిస్టు కార్యకలాపాలు ఎక్కువగా సాగుతున్న వేళ అ నంతర కాలంలో ఏర్పాటైన గ్రే హౌండ్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) విభాగాలకు తోదుగా వుండేందుకు ఫోన్ ట్యాపింగ్ యూనిట్ను ఎస్ఐబికి ఆ నుబంధంగా ఏర్పాటు చేశారు.

ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ యూనిట్

మొదట్లో చిన్నపాటి యూనిట్గా వున్న ఈ విభాగం 1990 దశకంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిఎం అయ్యాక మరింత ఆధునీకరించబడి నక్సలిజం ఏరివేతకు, అసాంఘీక కార్యకలాపాలను అణచివేసేందుకు తనవంతు సహాయాన్ని అందించింది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఫోన్ ట్యాపింగ్ యూనిట్ కొన్నేళ్లుగా కొందరు అధికారుల దుందుడుకు చర్యల కారణంగా బ్రష్టు పటి పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే చట్టపరంగా ఒక పద్దతి ప్రకారం పనిచేయాల్సిన ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) యూనిట్ చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినట్లు దీనిపై విచారిస్తున్న సిట్ (Sit) తేల్చింది ఫోన్ ట్యాపింగ్పై సర్కారు ఏర్పాటు చేసిన రివ్యూ కమిటీకి నాంకే వాస్తేగా కొన్ని నంబర్లు ఇచ్చి అంతకు వందింతల నంబర్లను ట్యాపింగ్ చేయడం ద్వారా ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ యూనిట్ అతి పెద్ద చట్ట ఉల్లంఘనకు పాల్పడింది.

టెలికాం చట్టాలను ఉల్లంఘించిన నేరానికి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డ పోలీసు అధికారులకు మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షపడే వీలుందని వారంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కొనసాగుతున్నదే. అయితే దీనిని పటిష్ట చట్టం మధ్య పగడ్బందీగా అమలు చేయాల్సి వుంది. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా ప్రభుత్వాలు విమర్శలు చవిచూడాల్సి వుంటుంది. ఇజ్రాయిల్ దేశం నుంచి కేంద్రం పెగాసేస్ అనే టెక్నాలజిని వాడుతూ ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తుందని కొన్నేళ్ల క్రితం పార్లమెంట్లో ప్రతిపక్షాలు సాగించిన ఆందోళన దేశ వ్యాప్తంగా సంచలనం రేవడం తెలిసిందే. ఇక రాష్ట్రం లో ఏడాదికి పైగా కొనసాగుతున్న ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది.

ఫోన్ ట్యాపింగ్ డిఐజి ద్వారా డిజిపికి లేఖ

ఫోన్ ట్యాపింగ్ అమలు గురించి పరిశీలిస్తే మావోయిస్టులతో పాటు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడేవారు, దేశ ద్రోహులపై మాత్రమే అమలు చేయాల్సి వుంది. దీనిపై ఆయా జిల్లాల ఎసిపిలు లేదా ఆస్థాయి అధికారులు ఎవరి ఫోన్లయితే ట్యాపింగ్ చేయాలో నంబర్లను తెలుపుతూ డిఐజి ద్వారా డిజిపికి లేఖ రాయాల్సి వుంది. ఆ తరువాత దీనిని పూర్తిగా పరిశీలించి, ఇదంతా నిజమని నిర్ధారణ అయ్యాక ఈ నంబర్లను హోం శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా పంపాల్సి వుంటుంది. అనంతరం దీనిపై హోం శాఖ ముఖ్య కార్యదర్శి హోం మంత్రికి సమాచారం ఇచ్చి దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఏర్పాటైన రివ్యూ కమిటీ అనుమతితో బిఎస్ఎన్ఎల్ అయితే టెలికాం శాఖకు ప్రైవేటు కంపెనీలు అయితే వాటి సర్వీస్ ప్రొవైడర్లకు లేఖ రాయాల్సి వుంటుంది. దీని తరువాత ఈ లేఖను పరిశీలించిన టెలికాం లేదా ప్రైవేటు కంపెనీలు ఫోన్ ట్యాపింగ్పై తమ పై అధికారులకు అధికారికంగా సమాచారం ఇచ్చి ట్యాపింగ్ చేయడానికి పరికరాలను సమకూరుస్తాయి. ఇదంతా టెలిగ్రాప్ చట్టంలో వున్న నిబంధనలు. వీటిని ఎవరూ ఉల్లంఘించేందుకు వీల్లేదు. ఉమ్మడి ఎపి హయాం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన కొంతకాలం వరకు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి టెలిగ్రాప్ చట్టం సక్రమంగానే అమలయ్యిందని అధికారులు చెబుతున్నారు. అయితే 2015 మే నెలలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఎసిబి అధికారులు అరెస్టు చేసిన తరువాత ఫోన్ ట్యాపింగ్ యూనిట్ పనితీరు వివాదాస్పదంగా మారి పూర్తిగా మసకబారే దశకు చేరింది. ఈ క్రమంలోనే గత ఏడాది మార్చి నెలలో వెలుగుచూసిన గోల్మాల్ వ్యవహరాలు అప్పట్లో జరిగిన చీకటి కోణాలను బహిర్గతం చేసింది.

అప్పట్లో ఎస్ఐబిలోని ఫోన్ ట్యాపింగ్ యూనిట్ సవ్యంగా పనిచేయలేదని దీనిపై విచారణ చేస్తున్న సిట్ అధికారుల విచారణలో తేటతెల్లమయ్యింది. టెలికాం సహా ప్రైవేటు సెల్ఫోన్ల కంపెనీలకు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి సర్కారు నుంచి నాంకే వాస్తేగా కొన్ని లేఖలు పంపినట్లు సిట్ తేల్చింది. అప్పట్లో డిజిపిలుగా, హోం శాఖ ముఖ్య కార్యదర్శులు గా, హోం మంత్రులుగా పనిచేసిన వారికి కూడా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి పూర్తి సమాచారం అందలేదని సిట్ విచారణలో తేలిందని సమాచారం. ఎస్ఐ బిలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ఆ విభాగం నాటి బాస్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే జరిగిందని సిట్ చెబుతుండగా నాటి డిజిపిలు, నిఘా విభాగం బాస్ల ఆదేశాలనే తాను పాటించానని ప్రభాకర్ రావు వాంగ్మూలం ఇచ్చారు. అయితే ప్రభాకర్ రావు వాంగ్మూలం అనంతరం సిట్ అధికారులు అప్ప ట్లో చీఫ్ సెక్రటరీలు, డిజిపిలు, నిఘా విభాగం బాస్లుగా పనిచేసిన వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నా ఇందులో కొందరివే వెలుగు చూడగా మిగతా వారివి గోప్యంగా వుంచారు. చీఫ్ సెక్రటరీలు, డిజిపిలు, నిఘా విభాగం బాస్ల వాంగ్మూలంలో తమపై అప్పట్లో ఒత్తిడి వుండడం వల్లే ఫోన్ ట్యాపింగ్కు అనుమతించామని వుందని తెలిసింది. దీనిపై స్పష్టత లేదు. సిట్ అధికారులు కూడా దీని గురించి ఏమీ మాట్లాడడం లేదు. ఫోన్ ట్యాపింగ్పై ప్రస్తుతం బాధితుల విచారణ కొనసాగుతోంది. మరో వారం పది రోజుల పాటు. ఇది కొనసాగే వీలుంది. దీని తరువాత ఈ కేసులో మరికొందరు నిందితులను చేర్చి వారిని విచారించే వీలుం ది. ఈ నిందితులు రాజకీయ నాయకులేనని తెలుస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి?

ఫోన్ ట్యాపింగ్ అంటే ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి ఒకరి ఫోన్ సంభాషణలను రహస్యంగా వినడం . చాలా సందర్భాలలో ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధం.

Read hindi news: hindi.vaartha.com

Read also: Crime: కన్న కూతుర్నే కడ తేర్చిన తల్లికి జీవిత ఖైదు

Breaking News Leaders phone tapping Phone Tapping Case Privacy violation Telangana phone tapping inquiry Telangana wiretapping Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.