తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం కావాలనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని కవిత మండిపడ్డారు.
Read Also: KCR phone tapping case : కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు! ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
ఫోన్ ట్యాపింగ్ జరగడం నిజంగా బాధాకరం
కేసును సీరియస్ గా తీసుకుని త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని.. అయితే, కేసును ముగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? లేదా? అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) జరగడం నిజంగానే చాలా బాధాకరమని.. కానీ, దానికి తగినటువంటి పర్యవసానాలను నేరస్తులు ఎదుర్కొంటారా? లేదా? అనేది వేచిచూడాలని అన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంటుందని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. రేపు కేసీఆర్ విచారణ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: