📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Phone Tapping Case: ప్రభాకర్ రావు కస్టడీ నేటితో పూర్తి

Author Icon By Saritha
Updated: December 18, 2025 • 12:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనున్న సిట్ బృందం

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి ముద్దాయిగా వుండి ఆరు రోజులుగా పోలీసు కస్టడీలో వున్న ఎస్ఐబి మాజీ బాస్ ప్రభాకర్ రావు భవితవ్యం సుప్రీం కోర్టు నిర్ణయంపై ఆధారపడి వుంది. (Phone Tapping Case) ప్రభాకర్ రావు సాధారణ విచారణలో ఏమీ చెప్పడం లేదని, కస్టడీకి ఇవ్వాలని పోలీసు శాఖ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి మరీ ఆయనను కస్టడీలోకి తీసుకోవడం తెలిసిందే. గత శుక్రవారం నాడు ప్రభాకర్ రావు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిట్ ఎసిపి వెంకటగిరి ఎదుట లొంగిపోవడం విదితమే. అంతకు ముందు ఆయనకు ఏడాది పాటు పోలీసుల అరెస్టు నుంచి మధ్యంతర అంతా ఉత్తర్వుల రక్షణ వుండింది. అయితే బుధవారంతో ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ఆరవ రోజుకు చేరింది. ఆరు రోజుల విచారణలో ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఎలాంటి విషయాలు చెప్పాడనేది పోలీసులు వెల్లడించడం లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రభాకర్ రావు పోలీసులను ముప్పతిప్పలు పెట్టి 36 చెరువుల నీళ్లు తాగిస్తున్నట్లు తెలిసింది.

Read also: Seethakka: ప్రశాంతంగా ముగిసిన పంచాయతి ఎన్నికలు.. మంత్రి ప్రశంసలు

ప్రభాకర్ రావు చివరి కస్టడీ, SIT నివేదిక సమర్పణ

ఫోన్ ట్యాపింగ్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, సవ్యంగానే జరిగిందని ప్రభాకర్ రావు చెప్పుకొచ్చారని తెలిసింది. ((Phone Tapping Case) తన పై బాస్లు, ఉన్నతాధికారులకు దీని గురించి తెలుసునని, ఇందులో అక్రమాలకు తావులేదని ఆయన పదే పదే చెప్పినట్లు తెలిసింది. అక్రమాలు జరిగాయని, ఇందుకు ప్రభాకర్ రావు బాధ్యుడని ఇంతకు ముందు అరెస్టయిన నలుగురు నిందితులు ఇచ్చిన వాంగ్మూలం కాఫీలను కూడా ప్రభాకర్ రావు తిరస్కరించని, ఇదంతా కల్పితమని, కావాలని, వారిచేత బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారని, హార్డ్ డిస్క్ ధ్వంసం అంతా నాటకమని అన్నట్లు తెలిసింది. బిఆఎర్ఎస్(BRS) అధినేత కెసిఆర్ అంతా కుమార్తె కవిత ఫోన్తో పాటు ఆమె భర్త అనిల్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కవిత మీడియా సమావేశం నిర్వహించి మరీ ఆరోపించడం తెలిసిందే. ఇదే విషయమై ప్రభాకర్ రావును ప్రశ్నిస్తే అంతా… తూచ్… అన్నట్లు తెలిసింది.

కాగా ప్రభాకర్ రావు చివరి రోజు కస్టడీ గురువారంతో ముగియనుంది. దీని తరువాత కస్టడీలో ప్రభాకర్ రావు వెల్లడించిన వివరాలను సిట్ అధికారులు సుప్రీం కోర్టుకు వెల్లడించనున్నారు. ఈ ప్రక్రియ శుక్రవారం జరగనుందని సమాచారం. అప్పటి వరకు ప్రభాకర్ రావు పోలీసు కస్టడీలోనే వుండనున్నారని సమాచారం. అనంతరం దీనిపై సుప్రీం కోర్టు విచారించి ప్రభాకర్ రావు కస్టడీపై ఒక నిర్ణయం తీసుకునే వీలుంది. మరోవైపు పోలీసు శాఖ ప్రభాకర్ రావును మరో వారం రోజుల పాటు కస్టడీకి కోరనుందని తెలిసింది. మొదటి వారం రోజులు ఆయన ఎలాంటి సమాచారం వెల్లడించనందున కస్టడీని పొడిగించాలని కోరాలని పోలీసు శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై శుక్రవారం నాడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలయ్యే వీలుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Latest News in Telugu Phone Tapping Case Police Custody Prabhakar rao sit investigation Supreme Court Telangana news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.