📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Phone tapping case: ఇక కవిత దంపతుల విచారణ!

Author Icon By Tejaswini Y
Updated: February 3, 2026 • 11:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case)లో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ విచారణ తరువాత తదు పరి విచారణ కవిత దంపతులతో పాటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్కు చెందిన బిఆర్ఎస్ ముఖ్య నేతలను విచారించాలని సిట్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ కేసులో సిటీ పోలీసు కమిషనర్ సజ్జన్నార్ నేతృత్వంలోని రెండవ సిట్ ఏర్పాటయ్యాక దర్యాప్తు వేగం పుంజురోవడం తెలిసిందే. రెండు వారాల వ్యవధిలో బిఆర్ఎస్ ఎంఎల్ సి నవీన్ రావు, మాజీ మంత్రులు హరీష్ రావు, కెటిఆర్, మాజీ ఎంపి సంతోష్ రావులను వరుసగా సుధీర్ఘంగా విచారించిన సిట్ ఈ విచారణలో వెలుగు చూసిన సమాచారం ఆధారంగా ఆదివారం నాడు పార్టీ అధినేత కెసిఆర్ను నాలుగు గంటల 45 నిమిషాల పాటు విచారించడం విదితమే. కెసిఆర్ విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగు చూసినట్లు తెలిసింది.

Read Also: HYD Crime: హుస్సేన్‌సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య?

Phone tapping case: Now the trial of the Kavitha couple!

కెసిఆర్ ఇచ్చిన వాంగ్మూలంలో కొత్త విషయాలు

అప్పట్లో జరిగిన ఫోన్ ట్యాపింగ్లో చాలా వరకు వ్యవహారాలు కెసిఆర్కు తెలియకుండానే ఎస్ఐబి అధికారులు చాటుమాటుగా నడిపించారని నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఎస్ఐబి చీఫ్ గా ప్రభాకర్ రావుకు వరుసగా ఎందుకు ఎక్స్టెన్షన్ ఇచ్చారనే దానిపై కెసిఆర్ సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి కెసిఆర్ ఇచ్చిన వాంగ్మూలంలో కొత్త విషయాలు వెలుగు చూసినట్లు తెలిసింది. ఇందులో ఉమ్మడి వరంగల్, క రీంనగర్కు చెందిన బిఆర్ఎస్ ముఖ్య నేతలు ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించారని సిట్ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో అ ప్పట్లో ఉమ్మడి వరంగల్లో బిఆర్ఎస్ఓ కీలకంగా వ్యవహరించి, ప్రభుత్వంలోనూ పదవి అనుభవించిన ఓ ముఖ్యనేతతో పాటు మరో ముగ్గురు నేత లను సిట్ విచారించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

అప్పట్లో వరంగల్ లో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఏకంగా ఒక ప్రత్యేక కేంద్రాన్నే ఆ కీలక నేత ఏర్పాటు చేసినట్లు సిట్కు ఆధారాలు లభించినట్లు తెలిసింది. హైదరాబాద్లో నాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతల ట్యాపింగ్(Tapping of Congress leaders) చేసేందుకు మొబైల్ ట్యాపింగ్ విభాగం ఏర్పాటు చేసినట్లు, వరంగల్లోనూ ఇలాంటిది నెలకొల్పినట్లు సిట్ అధికారులకు ఆధారాలు లభించినట్లు తెలిసింది. అప్పట్లో సదరు నేత ఎవరి నంబర్ను ట్యాపింగ్ చేయాలని చెబితే దానిని ఎస్ఐబి అధికారులు ట్యాప్ చేసినట్లుగా సిట్ గుర్తించినట్లు తెలిసింది. వరంగల్ కేంద్రంగా సాగిన ఈ ట్యాపింగ్ న ఖమ్మం జిల్లా నేతలను కూడా టార్గెట్ చేసినట్లుగా సిట్ గుర్తించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అప్పట్లో ప్రతిపక్ష నేతలకు చెందిన డబ్బులు భారీగా పట్టుబడినట్లు సిట్కు ఆధారాలు లభించాయని సమాచారం.

వరంగల్ తరువాత ఉమ్మడి కరీంనగర్లోనూ ఇలాంటి మొబైల్ ట్యాపింగ్ కేంద్రం పనిచేసిందని సిట్ గుర్తించిందని తెలిసింది. ఈ కేంద్రం కరీంనగర్లోని ప్రతిపక్ష నేత లతో పాటు స్వపక్ష నేతలను టార్గెట్ చేసినట్లుగా సిట్ గుర్తించిందని తెలిసింది. దీంతో పాటు నిజామాబాద్ జిల్లాలోని ప్రతిపక్ష, స్వపక్ష నేతలను ఈ కేంద్రం టార్గెట్ చేసిందని సిట్ నిర్దారించినట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్ కేంద్రాల నిర్వాహకులను విచారించేందుకు సిట్ నిర్ణయించి నట్లు సమాచారం. అంతకు ముందు ఫోన్ ట్యాపింగ్ కవిత దంపతుల వాంగ్మూలం తీసుకునే వీలుందని తెలిసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

brs leaders CP Sajjanar harish rao kavitha KCR Investigation ktr Phone Tapping Case SIT Probe Telangana news telangana police

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.